Telugu Global
Cinema & Entertainment

గుంటూరు సెంటిమెంట్ ను బయటపెట్టిన నితిన్

గుంటూరుకు, నితిన్ కు ఓ చిన్న కనెక్షన్ ఉంది.. అదేంటో ఆయన చెబితేనే బాగుంటుంది...

గుంటూరు సెంటిమెంట్ ను బయటపెట్టిన నితిన్
X

కొందరికి కొన్ని సెంటిమెంట్స్ అలా ఉండిపోతాయి. నితిన్ కు కూడా అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. గుంటూరుతో అతడి సెంటిమెంట్ కు ముడిపడి ఉంది. అదేంటో అతడి మాటల్లోనే..

"సై హిట్ తర్వాత గుంటూరు వచ్చాను. అప్పుడు ఇదే ప్రేమ ఇచ్చారు. తర్వాత అఆ సినిమా హిట్ తర్వాత వచ్చాను. మళ్ళీ అదే ప్రేమ చూపించారు. ఈసారి సినిమా రిలీజ్ ముందే వచ్చాను. మీ ఎనర్జీ చూస్తుంటే 'మాచర్ల నియోజకవర్గం' హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తుంది. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. మీ ఆదరణ, ప్రేమ లేకపోతే ఈ ప్రయాణం జరిగేది కాదు. మీ ప్రేమ ఎప్పుడూ ఇలానే వుండాలి. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ ఎలా ఉందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్ గా ఉంటుంది."

ఇలా గుంటూరుతో తనకున్న సెంటిమెంట్ ను బయటపెట్టాడు నితిన్. ఈ హీరో నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం. ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ ఫంక్షన్ ను గుంటూరు బ్రాడీపేటలో నిర్వహించారు. అనీల్ రావిపూడి చేతుల మీదుగా ఈ ట్రయిలర్ ను రిలీజ్ చేశారు.

ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. కృతిశెట్టి, క్యాథరీన్ హీరోయిన్లుగా నటించారు. మహతి స్వరసాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను ఆగస్ట్ 12న రిలీజ్ చేస్తున్నారు.

First Published:  31 July 2022 10:09 AM GMT
Next Story