Telugu Global
Cinema & Entertainment

Nithin, Rashmika Movie: భీష్మ కాంబో రిపీట్ అయింది

Nithin, Rashmika Movie: భీష్మ కాంబో మళ్లీ కలిసింది. ఈసారి ఈ కాంబోకు #VNRTrio అనే హ్యాష్ ట్యాగ్ తగిలించారు.

Nithin, Rashmika Movie: భీష్మ కాంబో రిపీట్ అయింది
X

Nithin, Rashmika Movie: భీష్మ కాంబో రిపీట్ అయింది

#VNRTrio- వెంకీ కుడుముల, నితిన్, రష్మిక ఈ ముగ్గురి కాంబినేషన్ లో వచ్చిన ‘భీష్మ’ భారీ విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం పూర్తిగా వినోదాల్ని అందించడంతో పాటు ఆర్గానిక్ ఫార్మింగ్ కి సంబంధించిన మంచి సందేశం ఇచ్చింది. ఉగాది సందర్భంగా ఈ ముగ్గురి కాంబోలో కొత్త చిత్రం ఒక ఫన్నీ వీడియో ద్వారా అనౌన్స్ చేశారు.

వీడియోలో నితిన్, రష్మిక, సంగీత దర్శకుడు జివి ప్రకాష్ కుమార్ దర్శకుడి కోసం ఎదురు చూస్తారు. వెంకీ కుడుముల వచ్చి లేట్ అయ్యానా? అని అడుగుతాడు.. ముగ్గురు కలసి బాగా..అని అంటారు. స్క్రిప్ట్ కూడా బాగా వచ్చిందని చెప్తాడు వెంకీ. ఛలో, భీష్మ లాగా ఈ చిత్రం కూడా వినోదాత్మకంగా ఉంటుందా అని అడిగినప్పుడు.. ఇది వేరేగా ఉంటుందని చెప్పడం ఆసక్తికరంగా ఉంది.

ఈ ముగ్గురి కాంబోలో రాబోతున్న సినిమా మరింత వినోదాత్మకంగా, అడ్వంచరస్ గా ఉంటుంది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనుంది. మైత్రీ మూవీస్ ఈ ప్రాజెక్ట్ లో చేరడంతో సినిమా స్కేల్ పెరిగింది. అంతేకాదు సినిమా క్రేజ్ కూడా పెరిగింది.

నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రానికి నిర్మాతలు కాగా, జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో తెలియజేస్తారు. చూస్తుంటే, ఈ ప్రాజెక్టు పాన్ ఇండియా లెవెల్లో వచ్చేలా ఉంది.



First Published:  23 March 2023 3:03 PM GMT
Next Story