Telugu Global
Cinema & Entertainment

'మాచర్ల'పై నితిన్ నమ్మకానికి కారణం ఇదే

మాచర్ల నియోజకవర్గం సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుందంటున్నాడు నితిన్. ఇందులో కంటెంట్ అలాంటిందని చెబుతున్నాడు.

మాచర్లపై నితిన్ నమ్మకానికి కారణం ఇదే
X

పక్కా మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో వస్తోంది మాచర్ల నియోజకవర్గం సినిమా. కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి మారిన నేపథ్యంలో, ఇలాంటి మాస్ సినిమాలు ఆడతాయా అనే సందేహం అందర్లో ఉంది. నితిన్ కు మాత్రం అలాంటి డౌట్ లేదు. ఈ టైమ్ లో ఇలాంటి సినిమానే కరెక్ట్ అంటున్నాడు.

"కోవిడ్ కి ముందు లాక్ చేసిన కథ కదా, కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా ఏమైనా మార్పులు చేశారా అని చాలామంది అడుగుతున్నారు. అలాంటిదేం చేయలేదు. ఫస్ట్ లాక్ చేసిన కథనే తీశాం. కోవిడ్ తర్వాతే కమర్షియల్ సినిమాకి ఇంకా స్కోప్ పెరిగింది. సాఫ్ట్, కంటెంట్ బేస్డ్ సినిమాలు తక్కువ ఆడుతున్నాయి. మాస్, హ్యుమర్, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలే ఎక్కువ ఆడుతున్నాయి. కాబట్టి మా సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది."

ఇలా మాచర్ల నియోజకవర్గం సినిమా కంటెంట్ ను వెనకేసుకొచ్చాడు హీరో నితిన్. మారిన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లను చూపిస్తే సినిమా విజయం సాధిస్తుందని.. అలాంటి పాత్ర, కథ తమ సినిమాలో ఉన్నాయని చెబుతున్నాడు ఈ హీరో.

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది మాచర్ల నియోజకవర్గం. కృతి షెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాతో రాజశేఖర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ సినిమాకు నిర్మాత.

First Published:  11 Aug 2022 3:16 AM GMT
Next Story