Telugu Global
Cinema & Entertainment

SPY Movie Trailer Review: నిఖిల్ మూవీ 'స్పై' ట్రయిలర్ రిలీజ్

Nikhil's SPY Movie Trailer Review: నిఖిల్ హీరోగా నటించిన యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ స్పై. ఈ సినిమా నుంచి తాజాగా ట్రయిలర్ రిలీజైంది.

SPY Movie Trailer Review: నిఖిల్ మూవీ స్పై ట్రయిలర్ రిలీజ్
X

హీరో నిఖిల్ తాజా చిత్రం స్పై. ఫేమస్ ఎడిటర్ గ్యారీ, ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈడీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీనికి కారణం, టీజర్ దేశవ్యాప్తంగా హిట్టవ్వడమే. సుభాష్ చంద్రబోస్ జీవితంలోని రహస్యాల్ని నేపథ్యంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది.

టీజర్ కు కొనసాగింపుగా ట్రయిలర్ ఉంది. సినిమా మొత్తం నేతాజీ ఫైల్స్ చుట్టూ తిరుగుతుందనే విషయం ట్రయిలర్ చూస్తే అర్థమౌతుంది. దీనికి తోడు బ్రదర్ సెంటిమెంట్ ను కూడా యాడ్ చేశారనే విషయం ట్రయిలర్ లో ఉంది. నేతాజీ ఫైల్స్ కు, నిఖిల్ బ్రదర్ మరణానికి లింక్ ఏంటనేది స్పై సినిమా కథలా కనిపిస్తోంది.

మోడ్రన్ స్పైగా నిఖిల్ ఇందులో ఎనర్జిటిక్ గా కనిపించాడు. అతడి లుక్, యాక్టింగ్, యాక్షన్ బాగున్నాయి. ట్రయిలర్ లో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి ఫీల్ తెచ్చిపెట్టింది. హీరోయిన్ ఐశ్వర్య మీనన్ పాత్రకు ట్రయిలర్ లో పెద్దగా స్కోప్ ఇవ్వలేదు. కాకపోతే ఆమె పాత్రకు కూడా వెయిట్ ఉందనే విషయం కొన్ని షాట్స్ ద్వారా తెలిసింది.

ఇవన్నీ ఒకెత్తు, ట్రయిలర్ చివర్లో రానా ఎప్పీయరెన్స్ మరో ఎత్తు. స్పై సినిమాలో రానా స్పెషల్ రోల్ చేశాడు. ట్రయిలర్ లో అతడికి కూడా స్థానం కల్పించారు. ఈనెల 29న గ్రాండ్ గా థియేటర్లలోకి వస్తోంది స్పై. కార్తికేయ-2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత నిఖిల్ నుంచి వస్తున్న సినిమా ఇదే.



First Published:  22 Jun 2023 1:52 PM GMT
Next Story