Telugu Global
Cinema & Entertainment

SPY Movie - నిఖిల్ నటిస్తున్న స్పై మూవీ టీజర్ రిలీజ్

SPY Movie Teaser - మరో పాన్ ఇండియా సినిమా రెడీ చేస్తున్నాడు నిఖిల్. సినిమా పేరు స్పై. ఈరోజు టీజర్ రిలీజ్ అయింది.

SPY Movie - నిఖిల్ నటిస్తున్న స్పై మూవీ టీజర్ రిలీజ్
X

సుభాష్ చంద్రబోస్ జీవితం వెనుక దాగిన రహస్యాల ఆధారంగా తెరకెక్కిన సినిమా స్పై. నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా టీజర్ ను ఈరోజు లాంఛ్ చేశారు. ఢిల్లీలోని కర్తవ్య పథ్ (రాజ్‌పథ్) లో సుభాష్ చంద్రబోస్ విగ్రహం సాక్షిగా స్పై టీజర్ రిలీజ్ చేశారు. ఈ ఐకానిక్ ల్యాండ్‌ మార్క్‌ వద్ద లాంచ్ అయిన మొదటి సినిమా టీజర్ ఇదే.

భగవాన్ జీ ఫైల్స్ గురించి మకరంద్ దేశ్‌ పాండే తన టీం కి వివరించడంతో టీజర్ ప్రారంభమవుతుంది, ఇది ఇండియన్ సీక్రెట్, ఆజాద్ హింద్ ఫౌజ్ సృష్టికర్త, సుభాష్ చంద్రబోస్ గురించి చెబుతుంది. విమాన ప్రమాదంలో నేతాజీ మరణించడాన్ని ఓ కవర్-అప్ కథగా టీజర్ లో చెప్పారు. లీడ్ రోల్ పోషిస్తున్న నిఖిల్ కి మిస్టరీని ఛేదించే బాధ్యతను అప్పగిస్తారు. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ పడతాయి.

తెలియని వాస్తవాలను తెలుసుకోవడం ఎల్లప్పుడూ గొప్ప విషయం. స్పై ఇండియన్ బెస్ట్ సీక్రెట్ ని చూపించబోతోంది. గ్యారీ బిహెచ్ కథనం పరంగా తొలి చిత్రంతోనే దర్శకుడిగా టీజర్ తో మంచి ఇంపాక్ట్ చూపించాడు.

‘స్పై’ పాత్రలో నిఖిల్ అద్భుతంగా కనిపించాడు. ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా, సన్యా ఠాకూర్ సెకండ్ హీరోయిన్. ఆర్యన్ రాజేష్ తన కమ్ బ్యాక్ లో ప్రత్యేక పాత్ర పోషిస్తుండగా, అభినవ్ గోమటం కీలక పాత్రలో కనిపించనున్నాడు. స్పై సినిమాని జూన్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తారు.



First Published:  15 May 2023 1:29 PM GMT
Next Story