Telugu Global
Cinema & Entertainment

Swayambhu | నిఖిల్ పాన్ ఇండియా మూవీ లాంఛ్

Nikhil Swayambhu - నిఖిల్ మరో పాన్ ఇండియా మూవీ స్టార్ట్ చేశాడు. స్వయంభూ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది.

Swayambhu | నిఖిల్ పాన్ ఇండియా మూవీ లాంఛ్
X

'కార్తికేయ 2' చిత్రంతో దేశవ్యాప్తంగా ఫేం సంపాదించిన హీరో నిఖిల్. ఇప్పుడీ హీరో తన 20వ చిత్రాన్ని స్టార్ట్ చేశాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో 'స్వయంభు' సినిమాను లాంఛ్ చేశాడు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్ పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

శ్రావణ శుక్రవారం సందర్భంగా మేకర్స్ ఈరోజు సినిమాను పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, అల్లు అరవింద్ క్లాప్ కొట్టారు. గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తొలి షాట్‌కి దర్శకత్వం వహించారు.

సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ రోజు నుంచి ప్రారంభమైంది. నిఖిల్ యోధుడిగా గుర్రపు స్వారీ చేస్తూ డ్రాగన్‌పై బాణం వేస్తున్నట్లు కనిపించే పోస్టర్ ను రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని పాత్రలో నిఖిల్ కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ లాగే ఈ కొత్త పోస్టర్ నెక్స్ట్ లెవల్ లో ఉంది.

ఈ మూవీలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఓపెనింగ్ కు ఆమె కూడా హాజరైంది. స్వయంభు అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందుతుంది. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నిఖిల్ కెరీర్ లో తొలి పీరియాడిక్-హిస్టారికల్ మూవీ ఇది.

First Published:  18 Aug 2023 4:00 PM GMT
Next Story