Telugu Global
Cinema & Entertainment

క్రిస్మస్ కానుకగా నిఖిల్ సినిమా

చాన్నాళ్లుగా వాయిదా పడుతున్న 18-పేజెస్ సినిమాకు కొత్త తేదీ ఫిక్స్ చేశారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందని తెలిపారు నిర్మాతలు

క్రిస్మస్ కానుకగా నిఖిల్ సినిమా
X

వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది.

కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ డైరక్ట్ చేస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి రిలీజ్ డేట్ పై అప్ డేట్ వచ్చింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న 18-పేజెస్ సినిమాను విడుదల చేయబోతున్నారు.

నిజానికి కార్తికేయ-2, 18-పేజెస్ సినిమాలు రెండూ ఒకేసారి సిద్ధమయ్యాయి. వీటిలో ముందుగా కార్తికేయ-2ను థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించాడు నిఖిల్. అందుకే 18-పేజెస్ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. కార్తికేయ-2 రన్ ముగియడంతో, ఇప్పుడీ సినిమాను తెరపైకి తెచ్చారు.

ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించి ట్రయిలర్ రిలీజ్ డేట్ ను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనుంది.

First Published:  25 Oct 2022 5:29 AM GMT
Next Story