Telugu Global
Cinema & Entertainment

Nikhil-Ravi Teja: ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు?

Nikhil Vs Ravi Teja: ఈ ఇద్దరు హీరోల్లో ఎవరు ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నారు? ఇద్దరూ సక్సెస్ కొట్టే అవకాశాలున్నాయి.

Nikhil-Ravi Teja: ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇచ్చేది ఎవరు?
X

ప్రతి ఏటా ఫినిషింగ్ టచ్ ఇచ్చే హీరో ఒకడు ఉంటాడు. ఈ ఏడాది ఆ అవకాశం ఇద్దరు హీరోలకు దక్కింది. వాళ్లే రవితేజ, నిఖిల్. మరి ఈ ఇద్దర్లో 2022కు ఫినిషింగ్ టచ్ ఇచ్చే హీరో ఎవరు?

డిసెంబర్ 23న నిఖిల్ హీరోగా నటించిన 18-పేజెస్ సినిమా వస్తోంది. అదే రోజున రవితేజ హీరోగా నటించిన ధమాకా సినిమా కూడా రిలీజ్ అవుతోంది. ఈ ఏడాది ఎండింగ్ లో రిలీజ్ అవుతున్న పెద్ద సినిమాలు ఇవే.

30వ తేదీన మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏవీ లేవు. కాబట్టి ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలంటే అది రవితేజ, నిఖిల్ లో ఒక్కరు మాత్రమే. అదృష్టం కలిసొస్తే ఇద్దరూ కావొచ్చు.

ఈమధ్య కాలంలో సాలిడ్ హిట్ అందుకోలేకపోయాడు రవితేజ. ధమాకాతో ఆ ముచ్చట తీర్చుకోవాలనుకుంటున్నాడు. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేశాడు. సాంగ్స్ 2 హిట్టవ్వడం, ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో రవితేజ ప్రస్తుతానికి కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

అటు నిఖిల్ సంగతి సరేసరి. కార్తికేయ-2 సక్సెస్ తో మంచి ఊపుమీదున్నాడు ఈ హీరో. పైగా 18-పేజెస్ సినిమాకు చాలా ప్యాడింగ్ ఉంది. అల్లు అరవింద్ సపోర్ట్ ఉంది. సుకుమార్ లాంటి డైరక్టర్ ఇచ్చిన స్క్రిప్ట్ ఉంది. ఆల్రెడీ సాంగ్స్ హిట్టయ్యాయి. తాజాగా వచ్చిన ట్రయిలర్ అయితే కట్టి పడేసింది.

సో.. ధమాకా, 18-పేజెస్ సినిమాలపై అంచనాలు సమానంగా ఉన్నాయి. ఈ ఏడాది చివర్లో ఈ రెండు సినిమాలూ హిట్ అవుతాయా లేక ఒక్కటే షో స్టాపర్ గా నిలుస్తుందా అనేది చూడాలి.

First Published:  19 Dec 2022 9:30 AM GMT
Next Story