Telugu Global
Cinema & Entertainment

18 Pages: ఓపెన్ మైండ్ తో సినిమా చూడమంటున్న నిఖిల్

18 Pages: నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం. విడుదలకు సిద్ధమైన ఈ సినిమాను ఓపెన్ మైండ్ తో చూడమంటున్నాడు నిఖిల్.

18 Pages: ఓపెన్ మైండ్ తో సినిమా చూడమంటున్న నిఖిల్
X

కార్తికేయ-2 లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత 18-పేజెస్ సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు హీరో నిఖిల్. ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటుచేశారు. పనిలోపనిగా సెకెండ్ సింగిల్ కూడా రిలీజ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్ పాల్గొన్నాడు. 18-పేజెస్ సినిమాపై అంచనాలు పెరిగేలా మాట్లాడాడు. గీతాఆర్ట్స్ బ్యానర్ లో ఇలాంటి కథలో నటించడం తన అదృష్టం అన్న నిఖిల్.. సినిమా అందర్నీ షాక్ కు గురిచేస్తుందని చెబుతున్నాడు.

"ప్రేక్షకులకు నా నుంచి ఒకటే విన్నపం. 18-పేజెస్ సినిమాకు ఓపెన్ మైండ్ తో రండి. మీరు కచ్చితంగా సినిమా చూసి షాక్ అవుతారు, మేం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. ఎవ్వరూ ఊహించని సూపర్ స్టోరీ ఇందులో ఉంది. ఇదేదో ప్రచారం కోసం చెప్పడం లేదు. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట చెబుతారు. ఎలాంటి అంచనాలు లేకుండా రండి."

డిసెంబర్ 23న థియేటర్లలోకి రాబోతోంది ఈ సినిమా. నిన్నటితో ఈ సినిమా టోటల్ షూటింగ్ పూర్తయింది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. గోపీసుందర్ ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది.



First Published:  11 Dec 2022 11:12 AM GMT
Next Story