Telugu Global
Cinema & Entertainment

Nikhil: ఇకపై ఫోకస్ అంతా 18-పేజెస్ సినిమాపైనే!

Nikhil 18 pages: కార్తికేయ-2 హంగామా ముగియడంతో నితిన్ తన ఫోకస్ ను 18-పేజెస్ సినిమాపైకి షిఫ్ట్ చేశాడు.

Nikhil: ఇకపై ఫోకస్ అంతా 18-పేజెస్ సినిమాపైనే!
X

మొన్నటివరకు కార్తికేయ-2 సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నాడు నిఖిల్. ఆ సినిమా నార్త్ ఆడియన్స్ కు కూడా నిఖిల్ ను దగ్గర చేసింది. దీంతో ఇంకాస్త ఎక్కువగా ప్రచారం చేయాల్సి వచ్చింది. అలా పాన్ ఇండియా అప్పీల్ కూడా అందుకున్న ఈ హీరో, ఇప్పుడు తన తదుపరి చిత్రంపై ఫోకస్ పెంచాడు.

కార్తికేయ-2తో పాటు నిఖిల్ చేసిన సినిమా 18-పేజెస్. నిజానికి ఈ రెండు సినిమాలు దాదాపు ఒకేసారి రెడీ అయ్యాయి. అగ్రిమెంట్ ప్రకారం కార్తికేయ-2ను ముందుగా రిలీజ్ చేశారు. ఇప్పుడు 18-పేజెస్ పై దృష్టిపెట్టాడు నిఖిల్.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాలో నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఇదివరకే రిలీజైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇప్పుడు ప్రచారాన్ని ముమ్మరం చేశారు.

"18 పేజెస్" చిత్రం నుండి సాంగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం నుండి "నన్నయ్య రాసిన" అనే లిరికల్ వీడియో సాంగ్ ను నవంబర్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 23న క్రిస్టమస్ కానుకగా విడుదల చేయనున్నారు.

First Published:  19 Nov 2022 12:33 PM GMT
Next Story