Telugu Global
Cinema & Entertainment

నిఖిల్ సినిమాలు.. షూటింగ్ అప్ డేట్స్

నిఖిల్ చేతిలో రెండు సినిమాలున్నాయి. ఆ రెండు సినిమాలు ఏ స్టేజ్ లో ఉన్నాయి.. ఓసారి చెక్ చేద్దాం..

నిఖిల్ సినిమాలు.. షూటింగ్ అప్ డేట్స్
X

ప్రస్తుతం నిఖిల్ చేతిలో 2 సినిమాలున్నాయి. కార్తికేయ-2 లాంటి భారీ సక్సెస్ తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు నిఖిల్. దీంతో అతడు చేస్తున్న 2 సినిమాల్లో దేన్ని ముందుగా థియేటర్లలోకి తీసుకురావాలనే సస్పెన్స్ నడిచింది. దీనికి దీపావళి రోజు తెరదించాడు ఈ హీరో. 18-పేజెస్ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న వస్తుందని ప్రకటించాడు.

ఇప్పుడీ రెండు సినిమాలు ఏ స్టేజ్ లో ఉన్నాయో చూద్దాం. ముందుగా 18-పేజెస్ విషయానికొస్తే, ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ తాజాగా మొదలైంది. నిఖిల్, శత్రుతో పాటు కొంతమంది నటీనటులపై యాక్షన్ ఎపిసోడ్ తీస్తున్నారు. డిసెంబర్ మొదటి వారానికి ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది.

ఇక నిఖిల్ చేస్తున్న రెండో సినిమా స్పై. ఈ యాక్షన్ థ్రిల్లర్ కూడా దాదాపు రెడీ అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. అయితే సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాల్ని రీషూట్ చేయాలని నిర్ణయించారు. 18-పేజెస్ ఫైనల్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత స్పై మూవీ మళ్లీ సెట్స్ పైకి వస్తుంది.

First Published:  26 Oct 2022 3:10 PM GMT
Next Story