Telugu Global
Cinema & Entertainment

Nikhil - పీరియాడిక్ సినిమాలో నిఖిల్

Nikhil - నిఖిల్ కొత్త సినిమా ప్రకటించాడు. ఈసారి పీరియాడిక్ హిస్టారికల్ మూవీని ఎంచుకున్నాడు. సినిమా పేరు స్వయంభు.

Nikhil - పీరియాడిక్ సినిమాలో నిఖిల్
X

హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నిఖిల్ 20వ చిత్రాన్ని ప్రకటించారు. అంతేకాదు, ఫస్ట్ లుక్‌ను కూడా విడుదల చేశారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌ బ్యానర్ పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. నిఖిల్ కొత్త సినిమాకు ‘స్వయంభూ’ అనే టైటిల్ పెట్టారు.

స్వయంభూ అంటే స్వయంగా ఉద్భవించినదని అర్ధం. ' ఫస్ట్-లుక్ పోస్టర్ లో నిఖిల్‌ యుద్ధభూమిలో వీరుడిగా కనిపిస్తున్నాడు. పొడవాటి జుట్టుతో ఒక చేతిలో బల్లెం, మరో చేతితో డాలు పట్టుకొని పోరాట యోధుడిలా కనిపించాడు. నిఖిల్ గెటప్, మేకోవర్ బాగున్నాయి. ఆగస్టు నుంచి ఈ సినిమా ప్రారంభమౌతుంది.

నిఖిల్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా వస్తోంది స్వయంభూ. ఈ సినిమాకు టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం అందించగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు.

తను కెరీర్ లో తొలిసారి ఓ హిస్టారికల్ పీరియాడిక్ మూవీ చేయబోతున్నాననే విషయాన్ని కొన్ని రోజుల కిందట నిఖిల్ ప్రకటించాడు. ఆ సినిమానే ఈ స్వయంభూ.

First Published:  2 Jun 2023 2:53 AM GMT
Next Story