Telugu Global
Cinema & Entertainment

Niharika | నిర్మాతగా మారిన నిహారిక కొణెదల

Niharika Konidela - నిహారిక నిర్మాతగా మారింది. తన బ్యానర్ పై తొలి సినిమాను ప్రారంభించింది. నిర్మాతగా ఆమెకిదే తొలి ఫీచర్ ఫిలిం.

Niharika | నిర్మాతగా మారిన నిహారిక కొణెదల
X

మెగా కాంపౌండ్ నుంచి మరో నిర్మాత వచ్చింది. నిహారిక కొణెదల ప్రొడ్యూసర్ గా మారింది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ స్థాపించిన నిహారిక, తన బ్యానర్ పై కొన్ని వెబ్ సిరీస్ లు నిర్మించింది. ఇప్పుడు సినిమా రంగంలోకి ఎంటరైంది. తొలి సినిమాను ప్రకటించింది. తాజాగా మూవీ లాంఛనంగా మొదలైంది కూడా.

నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై కొత్త సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైంది. ముహూర్తపు సన్నివేశానికి నిహారిక అన్న, హీరో వరుణ్ తేజ్ క్లాప్ కొట్టాడు. నిహారిక తండ్రి నాగబాబు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించాడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్క్రిప్ట్‌ని నిహారిక కొణిదెల, డైరెక్టర్ యదు వంశీకి అందజేశారు. వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి, ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సినిమాలో దాదాపు అంతా కొత్త నటీనటులు నటిస్తున్నారు. దర్శకుడు యాదు వంశీకి కూడా ఇదే తొలి సినిమా. కాస్త టెన్షన్ గా ఉన్నప్పటికీ, మంచి కథ దొరకడంతో హిట్ కొడతామనే నమ్మకం ఉందని అంటోంది నిర్మాత నిహారిక. ఇప్పటివరకు కాన్సెప్ట్ బేస్డ్ వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ తీసిన నిహారిక.. ఈ సినిమాతో ఫీచర్ ఫిలిం సెగ్మెంట్ లోకి అడుగుపెడుతోంది.

ఇంకా పేరు పెట్టని ఈ కొత్త సినిమాతో 11 మంది హీరోలు, నలుగురు హీరోయిన్లు పరిచయం అవుతున్నారు. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి, సింగిల్ షెడ్యూల్ లో సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. అనుదీప్ దేవ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

First Published:  11 Nov 2023 1:43 PM GMT
Next Story