Telugu Global
Cinema & Entertainment

Niharika Konidela - ప్రొడక్షన్ పై దృష్టిపెట్టిన నిహారిక

Niharika Konidela - ప్రొడక్షన్ రంగంలోకి పూర్తిస్థాయిలో దిగింది నిహారిక కొణెదల. ఈ మేరకు ఆమె ఆఫీస్ కూడా ఓపెన్ చేసింది.

Niharika Konidela - ప్రొడక్షన్ పై దృష్టిపెట్టిన నిహారిక
X

హీరోయిన్ నిహారిక కొణెదల హీరోయిన్ అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే హీరోయిన్ గా ఆమె రాణించలేకపోయింది. మెగా హీరోల మద్దతు ఉన్నప్పటికీ, మెగా ఫ్యాన్స్ ఆమెకు పూర్తిస్థాయిలో మద్దతివ్వలేదు. దీనికితోడు పెళ్లి కూడా జరగడంతో, ఆమె పూర్తిగా కెమెరాకు దూరమైంది.

మళ్లీ ఇన్నాళ్లకు ప్రొఫెషనల్ లైఫ్ లోకి ఎంటరైంది నిహారిక కొణెదల. ఈసారి హీరోయిన్ గా కాకుండా, నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలని నిర్ణయించుకుంది. ఈమేరకు పింక్ ఎలిఫెంట్ అనే బ్యానర్ ను స్థాపించింది. ఈరోజు ఆఫీస్ కూడా తెరిచింది. త్వరలోనే కొత్త వెంచర్లు ప్రకటించబోతోంది.

నిజానికి నిహారికక ప్రొడక్షన్ కొత్త కాదు. చాన్నాళ్ల కిందటే యూట్యూబ్ కు కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసింది. తాజాగా జీ5కు 2 వెబ్ సిరీస్ లు కూడా అందించింది. ఆ అనుభవంతో ఇప్పుడు పూర్తిస్థాయి నిర్మాతగా మారాలనుకుంటోంది. కుదిరితే సినిమాలు నిర్మించాలనేది నిహారిక ఆలోచన.

First Published:  10 April 2023 2:12 PM GMT
Next Story