Telugu Global
Cinema & Entertainment

Ustaad Bhagat Singh | భగత్ బ్లేజ్

Ustaad Bhagat Singh - ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి మరో వీడియో రిలీజైంది. ఈసారి కూడా పవన్ యాక్షన్ లుక్ చూపించారు, గాజు గ్లాస్ డైలాగ్ అదనం.

Ustaad Bhagat Singh | భగత్ బ్లేజ్
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న యాక్షన్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. భగత్స్ బ్లేజ్ టీజర్‌ ను విడుదల చేయడం ద్వారా మేకర్స్, అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చారు.

ఉస్తాద్ భగత్ సింగ్ తన రేంజ్ ని విమర్శించే వారికి ఘాటుగా సమాధానం ఇస్తాడు. “ గాజు ప‌గ‌లే కొద్దీ ప‌దునెక్కుద్ది.. గ్లాసంటే సైజు కాదు.. సైన్యం.. కనిపించని సైన్యం ”అని కౌంటర్ ఇస్తూ పవన్ చెప్పిన డైలాగ్ ను ఈ వీడియోలో పెట్టారు.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ పాత్రను పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేశాడు. పంచ్ డైలాగులు సినినిమాలో భారీగా ఉన్నాయనే విషయం ఈ వీడియో చూస్తే అర్థమౌతుంది. టీజర్‌లో పవన్ కళ్యాణ్ తుపాకీ కాలుస్తూ, త్రిశూలం పట్టుకుంటూ ఫైట్ చేయడం కనిపించింది. ఈ వీడియోలో హీరోయిన్ శ్రీలీల కూడా కనిపించింది.

అయనంక బోస్ సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఆకట్టుకునే బ్యాగ్ గ్రౌండ్ స్కోర్‌ అందించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ లో అశుతోష్ రానా, నవాబ్ షా కీలక పాత్రలు పోషిస్తున్నారు.

First Published:  20 March 2024 2:17 AM GMT
Next Story