Telugu Global
Cinema & Entertainment

ఎట్టకేలకు ధమాకా నుంచి అప్ డేట్

రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ హంగామా ముగిసింది. ఇప్పుడు ధమాకా హంగామా మొదలైంది.

ఎట్టకేలకు ధమాకా నుంచి అప్ డేట్
X

మాస్ మహారాజా రవితేజ, త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో వస్తున్న ఔట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ "ధమాకా". ఈ సినిమా షూటింగ్ పార్ట్ చివరి దశకు చేరుకుంది. చిత్రాన్ని ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జింతాక్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారు. ఆగస్టు 18, మధ్యాహ్నం 12:01 గంటలకు ఈ సింగిల్ సోషల్ మీడియాలో రిలీజ్ కాబోతోంది. ఈ మాస్ నెంబర్ తో ధమాకా ప్రచారం అధికారికంగా మొదలైనట్టయింది.

ఈ మేరకు ధమాకా సినిమా నుంచి బ్రాండ్ న్యూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. పోస్టర్‌ లో రవితేజ సాంప్రదాయ దుస్తుల్లో శ్రీలీల ను ఎత్తుకొని కనిపిస్తున్నాడు. పోస్టర్ లో వారి ఎక్స్ ప్రెషన్స్ చూస్తుంటే జింతాక్ మాస్ డ్యాన్స్ నెంబర్ గా ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

'డబుల్ ఇంపాక్ట్' అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌ తో వస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, స్క్రీన్‌ప్లే , సంభాషణలు అందిస్తుండగా.. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.

First Published:  15 Aug 2022 1:07 PM GMT
Next Story