Telugu Global
Cinema & Entertainment

Hanu-Man: టీజర్ రిలీజ్ కు కొత్త తేదీ

Hanu-man: సూపర్ స్టార్ కృష్ణ అకాలమరణం కారణంగా వాయిదాపడింది హనుమాన్ సినిమా టీజర్ రిలీజ్ కార్యక్రమం. ఇప్పుడీ టీజర్ విడుదలకు కొత్త తేదీ ఫిక్స్ చేశారు

Hanu-Man: టీజర్ రిలీజ్ కు కొత్త తేదీ
X

ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో వస్తున్న ఇండియన్ సూపర్ హీరో చిత్రం 'హను-మాన్‌' ఈ సినిమా టీజర్ ని ఈ నెల 15న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే టైమ్ లో సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూయడంతో టీజర్ విడుదలని వాయిదా వేశారు. ఈరోజు, మేకర్స్ టీజర్ రిలీజ్ కోసం కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

హను-మాన్ టీజర్ నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 12:33 గంటలకు విడుదల కానుంది. హను-మాన్ ఆయుధాన్ని చూపిస్తూ ఓ అద్భుతమైన పోస్టర్ ద్వారా మేకర్స్ టీజర్ డేట్ ని అనౌన్స్ చేశారు. పోస్టర్ లో తేజ సజ్జ చేయి కొండపైన గదను ఎత్తడం కనిపిస్తోంది. అతని చేతికి బ్రాస్‌లెట్‌, రాగి కంకణం , వేలికి రెండు ఉంగరాలు కూడా ధరించాడు. పోస్టర్ టీజర్‌పై క్యూరియాసిటీని మరింత పెంచింది.

అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.

హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్స్ చేస్తారు.

First Published:  19 Nov 2022 12:06 PM GMT
Next Story