Telugu Global
Cinema & Entertainment

Custody Movie - ఇళయరాజా మార్క్ తో వచ్చిన పాట

Custody Movie - నాగచైతన్య హీరోగా నటిస్తున్న కస్టడీ సినిమా నుంచి కొత్త పాట రిలీజ్ చేశారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది.

Custody Movie - ఇళయరాజా మార్క్ తో వచ్చిన పాట
X

నాగ చైతన్య హీరోగా, వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతున్న సినిమా 'కస్టడీ'. మోస్ట్ ఎవైటెడ్ మూవీస్‌లో ఒకటిగా ఐఎండీబీ తో గుర్తింపు పొందింది ఈ సినిమా. అందుకు తగ్గట్టే ప్రచారాన్ని భారీగా చేస్తున్నారు మేకర్స్. తాజాగా మరో సింగిల్ రిలీజ్ చేశారు. ఈ పాటకు ఓ ప్రత్యేకత ఉంది.

ఈ రెట్రో థీమ్ మెలోడీని మాస్ట్రో ఇళయరాజా స్వరపరిచగా, ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా అరెంజ్ చేశారు. ఈ సంగీత ద్వయం ఇన్‌స్ట్రుమెంటేషన్‌తో పాటకు వింటేజ్ వైబ్‌ తీసుకొచ్చారు. ఇందులో లవ్లీ సాక్సోఫోన్, ఫ్లూట్, ట్రంపెట్, ట్రోంబోన్ బిట్‌లు సంగీత ప్రియులని అలరిస్తాయి. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ ఈ పాటని చాలా అద్భుతంగా ఆలపించారు.

వింటేజ్ టచ్ ఇచ్చేలా ఏడు భారీ, వైబ్రెంట్ సెట్స్‌లో పాటని చిత్రీకరించారు. నాగచైతన్య తన ఆరో తరగతి నుండి తన ప్రేమ కథను వివరించాడు. చైతూ, కృతి శెట్టి జోడీ బాగుంది. వారి బ్యూటీఫుల్ కెమిస్ట్రీ తో విజువల్స్ మరింత ఆకర్షణీయంగా కనిపించాయి.

శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ కానుకగా మే 12న విడుదల చేయబోతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత చైతన్య చేస్తున్న యాక్షన్ సినిమా ఇది.



First Published:  24 April 2023 2:31 AM GMT
Next Story