Telugu Global
Cinema & Entertainment

కోబ్రా సాంగ్.. రెహ్మాన్ నుంచి మరో ఫాస్ట్ బీట్

విక్రమ్ హీరోగా నటించిన సినిమా కోబ్రా. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి కొత్త పాట రిలీజైంది.

కోబ్రా సాంగ్.. రెహ్మాన్ నుంచి మరో ఫాస్ట్ బీట్
X

చియాన్ విక్రమ్ హీరోగా వైవిధ్యమైన సినిమాలతో ఆకట్టుకునే దర్శకుడు ఆర్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ 'కోబ్రా'. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మేకర్స్ సినిమాలోని అధీరా అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ఏఆర్ రెహమాన్ ఈ పాటని కంపోజ్ చేశాడు. ఈ పాట హీరో పాత్ర ఉన్నతమైన లక్షణాల వర్ణిస్తూ సాగింది. హరిప్రియ, నకుల్ అభ్యంగర్ ఈ పాటని ఎనర్జిటిక్ గా ఆలపించగా రాకేందు మౌళి సాహిత్యం అందించాడు. పాట మొత్తంలో రెహ్మాన్ మార్క్ కనిపించింది.

కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో గణితశాస్త్ర మేధావి పాత్రలో కనిపించబోతున్నాడు విక్రమ్. ఈ సినిమాలో ఇండియన్ వెటరన్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషించడం విశేషం. మియా జార్జ్, రోషన్ మాథ్యూ, కేఎస్ రవికుమార్, మృణాళిని రవి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. విక్రమ్ వేసిన గెటప్స్ ఈ సినిమాలో హైలెట్ కానున్నాయి.

ఎన్వీ సినిమాస్ బ్యానర్ పై ఎన్వీ ప్రసాద్.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల 'కోబ్రా' చిత్రం హక్కులను సొంతం చేసుకున్నారు. ఆగస్ట్ 11న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.


First Published:  19 July 2022 4:32 AM GMT
Next Story