Telugu Global
Cinema & Entertainment

మహేష్ సినిమాపై మరో రూమర్

New rumours on Mahesh trivikram movie - మహేష్ త్రివిక్రమ్ సినిమాలో అల్లు అర్జున్ కూతురు నటిస్తుందా?

మహేష్ బాబుతో సినిమా కోసం కొత్త స్ట్రాటజీ వాడనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్
X

మహేష్ బాబుతో సినిమా కోసం కొత్త స్ట్రాటజీ వాడనున్న త్రివిక్రమ్ శ్రీనివాస్

మహేష్ సినిమా పై పుకార్లు కొత్తేం కాదు. సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే ఊహాగానాలు చెలరేగాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఎప్పటికప్పుడు ఈ సినిమాపై గాసిప్స్ పుట్టుకొచ్చాయి. వాటన్నింటినీ యూనిట్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ వచ్చింది. తాజాగా ఇప్పుడు మరోసారి మహేష్ మూవీపై కొత్త పుకారు పుట్టుకొచ్చింది.

ఛైల్డ్ సెంటిమెంట్ తో తెరకెక్కుతోందట ఈ సినిమా. ఓ చిన్నారి చుట్టూ ఈ సినిమా తిరుగుతుందట. దీని కోసం అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హను తీసుకున్నారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో వెంటనే యూనిట్ లో కొంతమంది సభ్యులు రియాక్ట్ అయ్యారు.


మహేష్-త్రివిక్రమ్ సినిమాలో ఎలాంటి ఛైల్డ్ సెంటిమెంట్ లేదని క్లారిటీ వచ్చింది. ఇదొక ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన యాక్షన్ మూవీ అని వాళ్లు చెప్పుకొచ్చారు. ఫస్ట్ షెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలే తీశారు. సెకెండ్ షెడ్యూల్ లో టాకీ ఉంటుంది.


హారిక-హాసిని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

First Published:  31 Jan 2023 12:51 PM GMT
Next Story