Telugu Global
Cinema & Entertainment

Devara | ఎన్టీఆర్ సినిమా నుంచి మరో పోస్టర్

Devara Movie - ఎన్టీఆర్ దేవర సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజైంది. గ్లింప్స్ అప్ డేట్ కూడా వచ్చింది.

Devara | ఎన్టీఆర్ సినిమా నుంచి మరో పోస్టర్
X

దేవర సినిమా నుంచి న్యూ ఇయర్ గిఫ్ట్ వచ్చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి ఒకే ఒక్క పోస్టర్ అందుబాటులో ఉంది. అందులోనే తారక్ ఫస్ట్ లుక్ ను కూడా బయటపెట్టారు. మళ్లీ ఇన్నాళ్లకు దేవర నుంచి మరో పోస్టర్ వచ్చింది.

ఈసారి ఎన్టీఆర్ నుంచి మరో స్టిల్ ను విడుదల చేయడంతో పాటు దేవర పార్ట్-1 టైటిల్ లోగోను కూడా ఆవిష్కరించారు. అలా దేవర ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించారు మేకర్స్. ఈ ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా మొదటి భాగాన్ని ఏప్రిల్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్స్ ప్రారంభించిన టీమ్ న్యూ ఇయర్ స్పెషల్ గా ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. జనవరి 8న దేవర దర్శనం పేరిట గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నారు.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో విడుదల చేస్తారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ విలన్ భైరాగా కనిపించనున్నాడు. 'ఎన్టీఆర్ ఆర్ట్స్' పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలు.




First Published:  1 Jan 2024 3:36 PM GMT
Next Story