Telugu Global
Cinema & Entertainment

Rama Banam Movie - గోపీచంద్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్

Ramabanam Movie - గోపీచంద్ హీరోగా నటిస్తున్న సినిమా రామబాణం. ఈ సినిమా నుంచి తాజాగా మరో పోస్టర్, మరో టీజర్ రిలీజ్ చేశారు.

Rama Banam Movie - గోపీచంద్ సినిమా నుంచి స్పెషల్ పోస్టర్
X

'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత మాచో స్టార్ గోపీచంద్, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్‌ కాంబినేషన్ లో రూపొందుతోన్న హ్యాట్రిక్ ఫిల్మ్ 'రామబాణం'. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల భారీస్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన డింపుల్ హయతి హీరోయిన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే మేయర్ సంగీత దర్శకుడు.

హిట్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో 'రామబాణం'పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. తాజాగా సినిమా నుంచి ఓ స్పెషల్ పోస్టర్ వదిలారు. పండుగ వాతావరణాన్ని ప్రతిభింభించేలా గుడి ఆవరణలో పంచె కట్టు, నుదుటన బొట్టుతో గోపీచంద్, జగపతిబాబు ఒకరి చేయి ఒకరు పట్టుకొని నడిచొస్తున్న పోస్టర్ తెలుగుదనం ఉట్టిపడేలా ఎంతో అందంగా ఉంది.

శ్రీరామ నవమి సందర్భంగా పోస్టర్ తో పాటు ప్రత్యేక వీడియోను కూడా విడుదల చేశారు. "ఆ రాముడుకి లక్ష్మణుడు, హనుమంతుడు అని ఇద్దరు ఉంటారు. ఆ ఇద్దరినీ కలిపితే నేను" అనే బలమైన మాటతో రూపొందించిన వీడియో ఆకట్టుకుంటోంది.

సినిమాలో ప్రజా నాయకుడిగా జగపతి బాబు కనిపిస్తుండగా.. ఆయనకు అండగా నిలుస్తూ, ఆయన కోసం ఎంత దూరమైనా వెళ్ళే మిస్సైల్ లా గోపీచంద్ కనిపిస్తున్నాడు. వీడియోలో గోపీచంద్ మేకోవర్, యాక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామబాణం చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది.



First Published:  31 March 2023 2:25 PM GMT
Next Story