Telugu Global
Cinema & Entertainment

హంట్ సినిమా టైటిల్ పై వివాదం

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హంట్. ఇప్పుడీ సినిమా టైటిల్ చుట్టూ వివాదం ముసురుకుంది.

హంట్ సినిమా టైటిల్ పై వివాదం
X

సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా హంట్. ఈ సినిమా టైటిల్ ను గ్రాండ్ గా ప్రకటించారు. టైటిల్ ఏంటో చెప్పుకోండంటూ సోషల్ మీడియాలో క్విజ్ కార్యక్రమాలు కూడా పెట్టారు. అలా టైటిల్ ప్రకటించిన తర్వాత, టీజర్-సాంగ్ కూడా రిలీజ్ చేసి ప్రచారం స్పీడ్ పెంచారు. అయితే ఊహించని విధంగా ఈ సినిమా ఇప్పుడు వివాదాస్పదమైంది.

శ్రీ క్రియేషన్స్ పతాకం పై నిక్షిత్ హీరోగా దర్శకుడిగా నర్సింగ్ రావు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీని పేరు కూడా హంట్. ఈ చిత్రం యొక్క మోషన్ టీజర్ ను మీడియా ముందు విడుదల చేశారు. అసలైన హంట్ తమదే అంటున్నాడు ఈ హీరో.

"ఒక సినిమా టైటిల్ ని రాయల్ గా దొంగిలించారు. 2-3 నెలల నుంచి భవ్య క్రియేషన్స్ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాను, హంట్ టైటిల్ మేము రిజిస్టర్ చేసుకున్నాం, మీరు టైటిల్ మార్చుకోండి అని. వాళ్ళు పటించుకోవడం లేదు. ఛాంబర్ లో కూడా కంప్లయింట్ చేశాం. కానీ మాకు న్యాయం దొరకలేదు." అందుకే ఇలా మీడియా ముందుకొచ్చాం అంటూ బాధపడ్డాడు నిక్షిత్.

హంట్ టైటిల్ ను భవ్య క్రియేషన్స్ వాళ్లు దొంగిలించడంతో, తాము తమ సినిమా ఆడియోను కూడా అమ్ముకోలేకపోతున్నామని వాపోతున్నాడు హీరో నిక్షిత్. ఇకనైనా సుధీర్ బాబు, తన సినిమాకు టైటిల్ మార్చుకోవాలని వీళ్లు కోరుతున్నారు.

First Published:  18 Oct 2022 3:57 AM GMT
Next Story