Telugu Global
Cinema & Entertainment

AR Murugadas - మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా

AR Murugadas - మురుగదాస్ మరోసారి నిర్మాతగా మారాడు. ఈసారి మరో డిఫరెంట్ కాన్సెప్ట్ సెలక్ట్ చేసుకున్నాడు. గౌతమ్ కార్తీక్ హీరో.

AR Murugadas - మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా
X

మన దేశ స్వాతంత్ర్యం గురించి ఇప్పటివరకు ఎవరు చెప్పని షాకింగ్ కథతో ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్ 'ఆగస్ట్ 16, 1947' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. గౌతమ్ కార్తీక్ హీరోగా పర్పుల్ బుల్ ఎంటర్టైన్మెంట్స్, ఏఆర్ మురుగదాస్ ప్రొడక్షన్, గాడ్ బ్లెస్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

ఏప్రిల్ 7న 'ఆగస్ట్ 16, 1947' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు చిత్రాన్ని తీసుకువస్తున్నట్లు ఈ రోజు నిర్మాతలు వెల్లడించారు. తమిళం తో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, ఇంగ్లీష్ భాషలలో ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రేక్షకులను స్వాతంత్రం వచ్చిన సమయానికి ఈ సినిమా తీసుకు వెళ్తుందని, ఓ మంచి అనుభూతి ఇస్తుందని అంటున్నాడు నిర్మాత మురుగదాస్.

ఎన్.ఎస్. పొన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్ సరసన రేవతి నటించింది. హీరోయిన్ గా ఆమెకు ఇదే తొలి సినిమా. లెజెండరీ కమెడియన్ పుగళ్ కీలక పాత్ర పోషించారు.

విడుదల తేదీ వెల్లడించడంతో పాటు సినిమా కొత్త పోస్టర్ కూడా విడుదల చేశారు. స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో దేశంలోని ఒక పల్లెటూరిలో జరిగే కథతో రూపొందించిన హిస్టారికల్ సినిమా 'ఆగస్ట్ 16, 1947' అని అర్థమవుతుంది.

First Published:  15 March 2023 2:31 AM GMT
Next Story