Telugu Global
Cinema & Entertainment

Project K - ప్రభాస్ సినిమాలో కీలక మార్పు

Prabhas Project K Movie - ప్రాజెక్ట్-కె సినిమాలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ ప్రాజెక్ట్ నుంచి మ్యూజిక్ డైరక్టర్ ను తప్పించారు.

Project K - ప్రభాస్ సినిమాలో కీలక మార్పు
X

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇండియాలోనే అత్యంత కాస్ట్ లీ సినిమాగా వస్తోంది ఈ మూవీ. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పుడు ఓ కీలక మార్పు చోటుచేసుకుంది.

ప్రాజెక్ట్-కె సినిమా కోసం ముందుగా మిక్కీ జే మేయర్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే ఇప్పుడు అతడి స్థానంలో సంతోష్ నారాయణన్ ను తీసుకున్నారు. ప్రాజెక్ట్-కె కు పాటలతో పాటు నేపథ్య సంగీతం అందించబోతున్నాడు సంతోష్ నారాయణన్. ప్రస్తుతం ఈ సంగీత దర్శకుడు దసరా సినిమాకు వర్క్ చేస్తున్నాడు.

సంతోష్ నారాయణన్ తో పాటు ఓ బాలీవుడ్ మహిళా సింగర్ ను కూడా తీసుకున్నారు. ఆమె ఈ సినిమా కోసం ఓ పాటను కంపోజ్ చేసి ఇవ్వనుంది. ఇలా ఈ ఇద్దరూ సంగీతం అందిస్తారనే విషయాన్ని అశ్వనీదత్ ప్రకటించారు.

నాగ్ అశ్విన్ కు మిక్కీ జే మేయర్ కు మంచి సింక్ ఉంది. నాగ్ అశ్విన్ కు లైఫ్ టైమ్ గుర్తింపు తీసుకొచ్చిన మహానటి సినిమాకు మిక్కీనే సంగీతం అందించాడు. ఇప్పుడు ప్రాజెక్ట్-కె నుంచి అకస్మాత్తుగా మిక్కీని తీసేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

First Published:  26 Feb 2023 3:36 PM GMT
Next Story