Telugu Global
Cinema & Entertainment

RanaNaidu - మళ్లీ 'తెలుగు' వెర్షన్

Rana Naidu - రానానాయుడు తెలుగు వెర్షన్ ను తొలిగించారు. తాజాగా పునరుద్ధరించారు. దీంతో మళ్లీ విమర్శలు మొదలయ్యాయి.

RanaNaidu - మళ్లీ తెలుగు వెర్షన్
X

రానా నాయుడు.. వెంకటేష్, రానా కలిసి నటించిన వెబ్ సిరీస్. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ పై చెలరేగిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ఫ్యామిలీ హీరో వెంకీని బూతుగా మార్చేశారని, సిరీస్ మొత్తం అశ్లీలతతో నిండిపోయిందని కామెంట్స్ పడ్డాయి. దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ రానా నాయుడు తెలుగు ఆడియోను తొలిగించింది. మిగతా భాషల స్ట్రీమింగ్ మాత్రం నడుస్తోంది.

కేవలం విమర్శల వేడి వల్ల నెట్ ఫ్లిక్స్ తెలుగు వెర్షన్ ను తొలిగించిందని అంతా అనుకున్నారు. దానిపై కథనాలు కూడా వచ్చాయి. అయితే షాకింగ్ మేటర్ ఏంటంటే.. విమర్శలకు తలొగ్గి ఈ పని చేయలేదంట నెట్ ఫ్లిక్స్. సాంకేతిక కారణాల వల్ల మాత్రమే తెలుగు ఆడియోను తొలిగించిందట. అంతేకాదు, తెలుగు వెర్షన్ ను పునరుద్ధరించింది.

నెట్ ఫ్లిక్స్ ఇలా చేయడం ఇదే తొలిసారి కాదు. విమర్శలు వచ్చిన ప్రతిసారి సదరు వెర్షన్ ను తొలిగించడం, కొన్ని రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరించడం చేస్తుంటుంది. రానా నాయుడు విషయంలో కూడా అదే చేసింది. అయితే ఈసారి తెలుగు సబ్-టైటిల్స్ ను మాత్రం అది తీసేసింది. ఆడియో మాత్రం అందుబాటులో ఉంది.

ఈ సిరీస్ వివాదాస్పదమైనప్పటికీ, ప్రతి వారం టాప్-10 ఓటీటీలో కొనసాగుతూనే ఉంది. లక్షల మంది యూత్ ఈ సిరీస్ ను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగు వెర్షన్ ను పునరుద్ధరించినట్టుంది.

First Published:  2 April 2023 2:42 PM GMT
Next Story