Telugu Global
Cinema & Entertainment

Netflix | ఆ క్రేజీ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ గూటికి!

NETFLIX - కొత్త ఏడాదిలో మరింత జోరు చూపించనుంది నెట్ ఫ్లిక్స్. ఆల్రెడీ 12 సినిమాల రైట్స్ దక్కించుకుంది.

Netflix | ఆ క్రేజీ సినిమాలన్నీ నెట్ ఫ్లిక్స్ గూటికి!
X

కొత్త ఏడాదికి సంబంధించి తాము స్ట్రీమింగ్ కు పెట్టబోతున్న సినిమాల వివరాల్ని నెట్ ఫ్లిక్స్ బయటపెట్టింది. ప్రస్తుతానికి 12 సినిమాల డిజిటల్ రైట్స్ దక్కించుకున్నట్టు వెల్లడించింది. 2024లో ఇవన్నీ నెట్ ఫ్లిక్స్ లోకి వస్తాయని తెలిపింది

2023లో భోలా శంకర్, దసరా, బ్రో, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి, మ్యాడ్, ఖుషి వంటి చిత్రాలను స్ట్రీమింగ్ కు పెట్టింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం పుష్ప కి సీక్వెల్ వస్తున్న పుష్ప 2 స్ట్రీమింగ్ రైట్స్ దక్కించుకుంది. దీంతో పాటు.. ఎన్టీఆర్ దేవర, ప్రభాస్ సలార్‌ సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ గూటికి చేరాయి.

స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న బడ్డీ అనే సినిమా, విశ్వక్ సేన్ నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, నాని హాయ్ నాన్నా, యువీ క్రియేషన్స్ కార్తికేయ సినిమా, బాలకృష్ణ 109వ చిత్రం, గీతాఆర్ట్స్2 నుంచి తండల్, సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమాల్ని నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇవి కొన్ని మాత్రమే. త్వరలోనే మరిన్ని క్రేజీ సినిమాల రైట్స్ దక్కించుకుంటామని నెట్ ఫ్లిక్స్ తెలిపింది. 2023లో నెట్ ఫ్లిక్స్ తెలుగు బేస్ బాగా పెరిగింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో డబ్బులు పెడుతోంది ఈ అంతర్జాతీయ కంపెనీ.

First Published:  17 Jan 2024 4:50 PM GMT
Next Story