Telugu Global
Cinema & Entertainment

Netflix: నెట్ ఫ్లిక్స్ జోరు మాములుగా లేదుగా!

Netflix acquired 16 new Telugu movies కొత్త ఏడాది నెట్ ఫ్లిక్స్ తన జోరు చూపిస్తోంది.16 మూవీస్ దక్కించుకుంది.

Netflix: నెట్ ఫ్లిక్స్ జోరు మాములుగా లేదుగా!
X

టాలీవుడ్ కు సంబంధించి నెట్ ఫ్లిక్స్ ది ఎప్పుడూ ఆఖరి స్థానమే. అమెజాన్ ప్రైమ్, ఆహా లాంటి ఓటీటీలతో ఇది ఎప్పుడూ పోటీ పడలేదు. దీని వ్యూహాలు వేరు. అప్పుడప్పుడు మాత్రమే టాలీవుడ్ సినిమాల్ని స్ట్రీమింగ్ కు పెడుతుంది ఈ కంపెనీ. ఇలా అడపాదడపా మాత్రమే సినిమాలు కొనుగోలు చేసే ఈ సంస్థ, ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ పెంచింది.


కొత్త ఏడాదిలో నెట్ ఫ్లిక్స్ సంస్థ సరికొత్త ఊపుతో ముందుకొస్తోంది. క్రేజీ మూవీస్ అన్నింటినీ దక్కించుకుంటోంది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రావాల్సిన సినిమాను ఆల్రెడీ కొనుగోలు చేసింది నెట్ ఫ్లిక్స్. ఈ సినిమాతో పాటు ఏకంగా 16 సినిమాల డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది నెట్ ఫ్లిక్స్.

Advertisement


నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న సినిమాల్లో.. చిరంజీవి హీరోగా నటించిన భోళాశంకర్, అనుష్క కొత్త సినిమా, టిల్లూ స్క్ర్వేర్, దసరా, 18 పేజెస్, వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా, కల్యాణ్ రామ్ అమిగోస్, సాయితేజ్ విరూపాక్ష సినిమాలున్నాయి.


ఈ సినిమాల స్ట్రీమింగ్ రైట్స్ అన్నింటినీ నెట్ ఫ్లిక్స్ సంస్థ చకచకా కొనుగోలు చేసింది. కొత్త ఏడాదిలో అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5కు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అయింది.

Next Story