Telugu Global
Cinema & Entertainment

Nenu Student Sir - నేను స్టూడెంట్ సర్ విడుదల తేదీ

Nenu Student Sir movie - బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం నేను స్టూడెంట్ సార్. ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది

Nenu Student Sir - నేను స్టూడెంట్ సర్ విడుదల తేదీ
X

తొలి చిత్రం 'స్వాతిముత్యం'తో ఆకట్టుకున్న యంగ్ హీరో బెల్లంకొండ గణేష్ తన రెండో సినిమా ''నేను స్టూడెంట్ సార్!'తో ప్రేక్షకులముందుకు రాబోతున్నాడు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో వస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ని 'నాంది’ సతీష్ వర్మ నిర్మిస్తుండగా నూతన దర్శకుడు రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా టీజర్ అంచనాలను పెంచగా, ఫస్ట్ సింగిల్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.


తాజాగా ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ లాక్ చేశారు. నేను స్టూడెంట్ సార్! మార్చి 10న థియేటర్లలో విడుదల కానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో త్వరలోనే ప్రమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.


బెల్లంకొండ గణేష్ కు జోడిగా అవంతిక దస్సాని హీరోయిన్ గా నటిస్తుండగా, సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.


కృష్ణ చైతన్య కథ అందించిన ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం అందించాడు. అనిత్ మాదాడి సినిమాటోగ్రాఫర్ గా, ఛోటా కె ప్రసాద్ ఎడిటర్ గా, కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అందిస్తున్నాడు.

First Published:  22 Feb 2023 2:54 AM GMT
Next Story