Telugu Global
Cinema & Entertainment

Neha Shetty: బెదురులంకలో ట్రెడిషనల్ లుక్ లో నేహా

Neha Shetty: కార్తికేయ సరసన బెదురులంక అనే సినిమా చేస్తోంది నేహా శెట్టి. ఆమె ఫస్ట్ లుక్ ను తాజాగా రిలీజ్ చేశారు.

Neha Shetty: బెదురులంకలో ట్రెడిషనల్ లుక్ లో నేహా
X

కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నాడు. లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పై బెన్నీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజైంది.

'బెదురులంక 2012'లో చిత్ర పాత్రలో నేహా శెట్టి కనిపించనుంది. పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తోంది.

సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ... లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది.

అందంగా కనిపిస్తూ... అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుందని అంటున్నారు మేకర్స్. కార్తికేయ, నేహాది ఫ్రెష్ కాంబినేషన్. వీళ్ళిద్దరి సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. డ్రామాకి కామెడీ మిక్స్ చేసి తీసిన సినిమా ఇది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా తెరకెక్కింది.

ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తారు.

First Published:  6 Dec 2022 6:30 AM GMT
Next Story