Telugu Global
Cinema & Entertainment

Neha Shetty | రూల్స్ రంజన్ రొటీన్ కాదంటున్న నేహా

Neha Shetty - రూల్స్ రంజన్ కచ్చితంగా హిట్టవుతుందని చెబుతోంది నేహా శెట్టి. ఈ సినిమాలో ఆమె రెయిన్ డాన్స్ చేసింది.

Neha Shetty | రూల్స్ రంజన్ రొటీన్ కాదంటున్న నేహా
X

అక్టోబర్ 6న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'రూల్స్ రంజన్' సినిమా. కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు రత్నం కృష్ణ దర్శకత్వం వహించాడు సీనియర్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పిస్తున్న ఈ సినిమాలో తనది చాలామంచి పాత్ర అంటోంది నేహా శెట్టి. మీడియాతో ఆమె ప్రత్యేకంగా మాట్లాడింది.

"రూల్స్ రంజన్ కథ భిన్నంగా ఉంటుంది. ఈ కథలో సంఘర్షణ ఉంది. కామెడీ ఉంది. ఇది రొటీన్ అబ్బాయి-అమ్మాయిల కథ కాదు. ఇందులో ఆకర్షణీయమైన లవ్ థీమ్‌ ఉంది. ఇందులో నేను తిరుపతికి చెందిన అమ్మాయిగా నటించాను. గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలో కనిపిస్తాను. కాకపోతే మోడ్రన్ గా ఉంటుంది"

ఈ సినిమాలో సమ్మోహనుడా అనే సాంగ్ హిట్టయింది. ఇది ఓ రెయిన్ సాంగ్. ఈ పాటలో డాన్స్ చేయడం చాలా ఛాలెంజింగ్ అనిపించిందని, కానీ ఇప్పుడు అంతా మెచ్చుకుంటుంటే బాగుందని చెబుతోంది నేహా.

"వాన పాటల విషయానికొస్తే, నాకు అలనాటి తార దివంగత శ్రీదేవి గుర్తుకు వస్తారు. నేను ఆమెకి పెద్ద అభిమానిని. చాలా చిన్న వయస్సులో తన సినీ జీవితాన్ని ప్రారంభించిన ఆమె, ఎలాంటి హద్దులు లేకుండా ఉన్నత స్థాయికి చేరారు. అలాంటి నటిగా పేరు తెచ్చుకోవాలని ఉంది. నా మొదటి రెయిన్ సాంగ్ లో డాన్స్ ను, శ్రీదేవితో పోల్చడం ఆనందంగా ఉంది."

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది రూల్స్ రంజన్ సినిమా. బెదురులంకతో ఫ్లాప్ చవిచూసిన నేహాశెట్టి, ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ లోకి రావాలని భావిస్తోంది.

First Published:  3 Oct 2023 5:26 PM GMT
Next Story