Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్.. చిరు లుక్ పై విమర్శలు

చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ పై విమర్శలు ఎక్కువయ్యాయి

గాడ్ ఫాదర్.. చిరు లుక్ పై విమర్శలు
X

చిరంజీవి లేటెస్ట్ మూవీ గాడ్ ఫాదర్. ఈ సినిమా నుంచి తాజాగా అప్ డేట్ వచ్చింది. టీజర్ రిలీజ్ ఎప్పుడనేది చెప్పారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాతే అసలు చిక్కొచ్చి పడింది. టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించే సందర్భంగా చిరంజీవి లుక్ తో ఓ చిన్న పోస్టర్ రిలీజ్ చేశారు. దానిపై ఇప్పుడు విమర్శలు మొదలయ్యాయి.

చిరంజీవిని ఆయన అభిమానులు ఎప్పుడూ వింటేజ్ లుక్ లోనే చూడాలనుకుంటారు. ఆయనకు 6 పదుల వయసు దాటిన ఫ్యాన్స్ కు మాత్రం 30 ఏళ్ల యువకుడే. చిరు కూడా ఎప్పుడూ అలానే ఉండేందుకు ప్రయత్నిస్తారు. తన ఫిజిక్ ను, లుక్ ను కాపాడుకుంటూ వస్తున్నారు. అందుకే గాడ్ ఫాదర్ లుక్ అభిమానులకు నచ్చలేదు.

ఈ పోస్టర్ లో చిరంజీవి లుక్ లో అస్సలు గ్లామర్ లేదు. పైగా నెరసిన గడ్డం, జుట్టు పెట్టారు. అదేమంత స్టయిలిష్ గా కనిపించలేదు. ఈ సినిమాలో చిరంజీవి కాస్త వయసుమళ్లిన పాత్రలోనే కనిపిస్తారు. అంతమాత్రానికే ఇలాంటి లుక్ పెట్టడం ఏం బాగాలేదంటున్నారు ఫ్యాన్స్.

ఇలాంటి వయసుమళ్లిన పాత్రలు చిరంజీవి గతంలో కూడా చేశారు. కానీ ఆ పాత్రలకు ఓ ఎనర్జీ, ఓ స్పెషల్ టచ్ ఇచ్చారు మేకర్స్. కానీ గాడ్ ఫాదర్ లో మాత్రం చిరు లుక్ ఏమంత ఆకట్టుకునేలా అనిపించడం లేదు. ఈనెల 21న గాడ్ ఫాదర్ టీజర్ మార్కెట్లోకి వస్తోంది.

మోహన్ రాజ్ దర్శకత్వంలో లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న ఈ ప్రాజెక్టులో సత్యదేవ్, నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.





First Published:  18 Aug 2022 8:40 AM GMT
Next Story