Telugu Global
Cinema & Entertainment

Sundeep Kishan | సందీప్ కిషన్ సినిమాలు బాలీవుడ్ నటుడు

Sundeep Kishan - సాహోలో కీలక పాత్ర పోషించిన నీల్ నితిన్ ముకేష్.. సందీప్ కిషన్ చిత్రంలో విలన్ గా నటించబోతున్నాడు.

Sundeep Kishan | సందీప్ కిషన్ సినిమాలు బాలీవుడ్ నటుడు
X

హీరో సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన సినిమా ప్రాజెక్ట్‌ జెడ్/మాయవన్‌. ఇప్పుడీ ఇద్దరూ మరోసారి చేతులు కలిపారు. 'మాయవన్' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సీక్వెల్ ను ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌ నేపధ్యంలో రూపొందే ఈ చిత్రానికి రాంబ్రహ్మం సుంకర నిర్మాత.

ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారని మేకర్స్ కొత్త అప్‌డేట్‌ను అందించారు. సందీప్ కిషన్, నీల్ ఇద్దరూ ఈ సినిమాలో యాక్షన్-ప్యాక్డ్ పాత్రలను పోషించడానికి కొత్తగా మేకోవర్ అవుతున్నారు. నీల్ తన పాత్ర కోసం తన డిక్షన్‌పై వర్క్ చేస్తున్నారు. బరువు కూడా తగ్గుతారు.

మాయావన్‌లో సందీప్‌ కిషన్‌ సరసన ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. పలు ఓటీటీ సిరీస్‌లలో నటించిన ఆకాంక్ష మాయావన్‌తో వెండితెర ఎంట్రీ ఇస్తోంది.

టాప్-క్లాస్ ప్రొడక్షన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌తో హై బడ్జెట్‌తో రూపొందనున్న ఈ చిత్రం, సూపర్‌విలన్‌తో ఒక సామాన్యుడి ఘర్షణ కథగా ఉండబోతుంది. ఈ చిత్రానికి సెన్సేషనల్ కంపోజర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.

First Published:  17 Dec 2023 8:26 AM GMT
Next Story