Telugu Global
Cinema & Entertainment

Connect Trailer: కనెక్ట్ ట్రయిలర్ తో అదరగొట్టిన నయనతార

Connect Movie: నయనతార నటించిన తాజా చిత్రం కనెక్ట్. ఆమె భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రయిలర్ లాంచ్ చేశారు.

Connect Trailer: కనెక్ట్ ట్రయిలర్ తో అదరగొట్టిన నయనతార
X

నయనతార హీరోయన్ గా నటించిన హారర్ థ్రిల్లర్ "కనెక్ట్". ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ నిర్మించాడు. దర్శకుడు అశ్విన్‌ శరవణన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. హారర్ థ్రిల్లర్ మూవీస్ రూపొందించడంలో దర్శకుడు అశ్విన్ శరవణన్ కు మంచి పేరుంది. నయనతార హీరోయిన్ గా గతంలో ఆయన రూపొందించిన "మయూరి" సినిమా తెలుగులో విజయాన్ని సాధించింది. అలాగే తాప్సీ తో శరవణన్ తెరకెక్కించిన "గేమ్ ఓవర్" కూడా సూపర్ హిట్టయ్యింది. దీంతో "కనెక్ట్" సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాను గ్రాండ్ గా యూవీ క్రియేషన్స్ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది.

తాజాగా "కనెక్ట్" సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. దేశంలో లాక్ డౌన్ విధించడానికి 24 గంటల ముందు అంటూ ట్రైలర్ బిగిన్ అయ్యింది. కుటుంబంతో సంతోషంగా ఉండే నయనతార జీవితం ఆమె కూతురు అమ్ముకు ప్రేతాత్మ ఆవహించడంతో

ఆందోళనగా మారుతుంది. తానెంతో ప్రేమించే కూతురు విచిత్రంగా ప్రవర్తించడం, వింత శబ్దాలు చేయడంతో ఏం జరుగుతుందో నయనతారకు అర్థం కాని పరిస్థితి.

ట్రైలర్ లో కనిపించిన కొన్ని షాట్స్ భయపెడతాయి. దెయ్యాలు ఊరికే వెళ్లిపోవు అని చెప్పడం నయనతార తన కూతురును ఆత్మ నుంచి విడదీసేందుకు ఎంతగా శ్రమించాల్సి వచ్చిందనేది చూపిస్తోంది. మొత్తంగా ఈ ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.

ఈ చిత్రాన్ని ఈ నెల 22న తెలుగులో గ్రాండ్ గా విడుదల చేసేందుకు యూవీ క్రియేషన్స్ సంస్థ సన్నాహాలు చేస్తోంది. అనుపమ్‌ ఖేర్‌తోపాటు సత్యరాజ్‌, వినయ్‌ రాయ్‌, హనియ నఫిస కీలక పాత్రల్లో నటించారు.



First Published:  10 Dec 2022 5:21 AM GMT
Next Story