Telugu Global
Cinema & Entertainment

Miss Shetty Mr. Polishetty | టెన్షన్ తీరిందంటున్న నవీన్ పొలిశెట్టి

Miss Shetty Mr. Polishetty - ఇన్నాళ్లకు తన టెన్షన్ తీరిందంటున్నాడు హీరో నవీన్ పొలిశెట్టి. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సక్సెస్ మీట్ లో పాల్గొన్నాడు

Miss Shetty Mr. Polishetty | టెన్షన్ తీరిందంటున్న నవీన్ పొలిశెట్టి
X

హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన రీసెంట్ పాన్ ఇండియా మూవీ ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రానప్పటికీ.. యూఎస్ లో పెద్ద హిట్టయింది. త్వరలోనే అక్కడ 2 మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరబోతోంది.

ఈ మూవీకి ఆడియెన్స్ తో పాటు సెలబ్రిటీల అప్రిషియేషన్స్ దక్కుతున్నాయి. చిరంజీవి నుంచి మహేష్ వరకు చాలామంది ఈ సినిమాను మెచ్చుకుంటూ ట్వీట్స్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నవీన్ తో పాటు, దర్శకులు మారుతి, నాగ్ అశ్విన్, అనుదీప్ కేవీ, నందినీ రెడ్డి, బుచ్చిబాబు, మేర్లపాక గాంధీ, ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్, ఎస్కేఎన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.

ఈవెంట్ లో మాట్లాడిన నవీన్ పొలిశెట్టి, ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్పాడు. తాము నమ్మిన కథను ప్రేక్షకులు కూడా నమ్మినందుకు చాలా థ్రిల్ గా ఉందన్నాడు.

"మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి జర్నీ గురించి చెప్పాలంటే చాలా ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ డిలేస్, మూవీ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడం..ఇలా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. మేము సెప్టెంబర్ 7 డేట్ అనౌన్స్ చేయగానే ఒక పెద్ద హిందీ సినిమా అదే డేట్ కు వస్తోందని తెలిసింది. అప్పుడు మేము ఎంతో టెన్షన్ పడ్డాం. మేము అనుకున్న డేట్ కరెక్టేనా అని ఎన్నోసార్లు క్రాస్ చెక్ చేసుకున్నాం. ఈ నెల 7న డల్లాస్ లో ప్రీమియర్ వేసినప్పటి నుంచి ఈరోజు వరకు ప్రతి చోటా హౌస్ ఫుల్స్ కలెక్షన్స్ తో మూవీ ప్రదర్శితమవుతోంది. అనేక ఇబ్బందుల మధ్య మాకు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ చెబుతున్నా. మంచి సినిమా అనే మౌత్ టాక్ తోనే ఇది సాధ్యమైంది."

ఇలా తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు నవీన్ పొలిశెట్టి. ఎప్పట్లానే ఈ కార్యక్రమానికి కూడా అనుష్క హాజరుకాలేదు. ఈ సినిమా ప్రచారానికి దూరంగా ఉంది ఈ హీరోయిన్.

First Published:  17 Sep 2023 5:15 PM GMT
Next Story