Telugu Global
Cinema & Entertainment

Naveen Polishetty: స్టాండప్ కమెడియన్ గా నవీన్

Naveen Polishetty: నవీన్ పోలిశెట్ట, అనుష్క తో కలిసి ఓ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ నుంచి అతడి ఫస్ట్ లుక్ విడుదల చేశారు

Naveen Polishetty: స్టాండప్ కమెడియన్ గా నవీన్
X

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి కలిసి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఆల్రెడీ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నవీన్ పొలిశెట్టి ఫస్ట్ లుక్ విడుదల చేశారు.


నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి హీరోహీరోయిన్లుగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమాకు పి మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తోంది. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ నడుస్తోంది. తాజాగా నవీన్ పోలిశెట్టి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.


ఈ చిత్రంలో నవీన్ పోలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పోలిశెట్టి క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. కామెడీ టైమింగ్ లో మంచి పేరున్న నవీన్, స్టాండప్ కమెడియన్ గా మరింతగా నవ్వించనున్నాడు.


వచ్చే ఏడాది ఈ సినిమాకు రిలీజ్ చేస్తారు. ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఈ సినిమాకు రథన్ సంగీతం అందిస్తున్నాడు. నీరవ్ షా సినిమాటోగ్రాఫర్.

First Published:  27 Dec 2022 11:10 AM GMT
Next Story