Telugu Global
Cinema & Entertainment

Naveen Polishetty - డిఫరెంట్ టైటిల్ తో నవీన్-అనుష్క సినిమా

Naveen Polishetty and Anushka - అనుష్క, నవీన్ పోలిశెట్టి కలిసి సినిమా చేస్తున్నారు. తాజాగా టైటిల్ ఫిక్స్ చేశారు.

Naveen Polishetty - డిఫరెంట్ టైటిల్ తో నవీన్-అనుష్క సినిమా
X

అనుష్క, నవీన్ పోలిశెట్టి జంటగా నటిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ విడుదల చేశారు. వీరి కలయికలో సినిమా అనౌన్స్ అయినప్పుడే పరిశ్రమతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఓ రకమైన ఆసక్తి ఏర్పడింది. ఆ ఆసక్తిని రెట్టింపు చేసేలా ఫస్ట్ లుక్ టైటిల్ ను అనౌన్స్ చేసింది మూవీ టీమ్. అనుష్క, నవీన్ పేర్లు కలిసి వచ్చేలా.. చూడగానే ఆకట్టుకునేలా ఈ చిత్రానికి "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" అనే టైటిల్ ను ఖరారు చేసింది.

ఈ సినిమాలో నవీన్, సిద్ధు పోలిశెట్టి అనే స్టాండప్ కమెడియన్ గా, అనుష్క అన్విత రవళిశెట్టి అనే చెఫ్‌ పాత్రలో నటిస్తున్నారు. మహేష్‌ బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో గతంలో అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి బాక్సాఫీస్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోతోన్న ఈ "మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి" చిత్రాన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొంచించాడు దర్శకుడు మహేష్‌ బాబు.

నిశ్శబ్దం చిత్రంలో అద్భుత నటనతో ఆకట్టుకున్న అనుష్క.. తన ఇమేజ్ కు తగ్గట్టుగా అద్బుతమైన స్క్రిప్ట్ కావడంతో కొంత గ్యాప్ తర్వాత ఈ పాత్రకు ఓకే చెప్పింది. ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు సినిమాల తర్వాత నవీన్ పోలిశెట్టి కూడా కాస్త గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా ఇది. టైటిల్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం ఈ వేసవికి తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మళయాల భాషల్లో విడుదల కాబోతోంది.

First Published:  2 March 2023 9:15 AM GMT
Next Story