Telugu Global
Cinema & Entertainment

Naveen Chandra -కొత్త పేరుతో వస్తున్న పాత సినిమా

Naveen Chandra- దాదాపు 4 యేళ్ళ క్రితం ఓ సినిమా చేశాడు నవీన్ చంద్ర. ఆ సినిమాకి టైటిల్ మార్చి తాజాగా రిలీజ్ చేస్తున్నారు

Naveen Chandra -కొత్త పేరుతో వస్తున్న పాత సినిమా
X

నవీన్ చంద్ర హీరోగా నటించిన సినిమా 'హీరోహీరోయిన్'. ఈ సినిమా ఇప్పటిది కాదు. దాదాపు ఐదేళ్ల కిందటే ఫస్ట్ కాపీ రెడీ అయింది. కాకపోతే మార్కెట్ జరక్కపోవడంతో సినిమాను అలా పెండింగ్ లో పెట్టారు. మధ్యలో కరోనా రావడంతో మరింత గ్యాప్ వచ్చేసింది. అలా పాత సినిమాగా ముద్ర వేయించుకున్న ఈ సినిమాకు ఇప్పుడు కొత్త పేరు పెట్టారు.


ఓవైపు హీరోగా నటిస్తూ, మరోవైపు క్యారెక్టర్ రోల్స్ తో మెప్పిస్తున్నాడు నవీన్ చంద్ర. నేను లేని నా ప్రేమకథ, జమ్నా ప్యార్, కళా విప్లవం, ప్రణయం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ గాయత్రీ సురేష్. వీళ్లిద్దరూ కలిసి నటించిన హీరోహీరోయిన్ అనే సినిమాకు మాయగాడు అనే కొత్త టైటిల్ ఫిక్స్ చేశారు.


ఈ సినిమాలో పూజా జవేరి సెకెండ్ హీరోయిన్ గా నటించింది. అడ్డా ఫేం కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాను స్వాతి పిక్చర్స్ బ్యానర్‌పై భార్గవ్ మన్నె నిర్మించారు.


పైరసీ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న లవ్ స్టోరీ ఇది. ఈ సినిమాలో హీరో కొత్త సినిమాలను పైరసీ చేస్తుంటాడు. పైరసీ వలన సినీ పరిశ్రమకు ఏర్పడే నష్టాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. తాజాగా ట్రయిలర్ కూడా రిలీజ్ చేశారు.

First Published:  31 Jan 2023 12:35 PM GMT
Next Story