Telugu Global
Cinema & Entertainment

Inspector Rishi | నవీన్ చంద్ర నుంచి మరో క్రైమ్ డ్రామా

Inspector Rishi - నవీన్ చంద్ర హీరోగా నటించిన సిరీస్ ఇన్ స్పెక్టర్ రిషి. అమెజాన్ ప్రైమ్ ఈ సిరీస్ కు సంబంధించిన ట్రయిలర్ రిలీజ్ చేసింది.

Inspector Rishi | నవీన్ చంద్ర నుంచి మరో క్రైమ్ డ్రామా
X

తమిళ ఒరిజినల్ హారర్ క్రైమ్ డ్రామా సిరీస్ ఇన్‌స్పెక్టర్ రిషి. నవీన్ చంద్ర హీరోగా నటించిన వెబ్ సిరీస్ ఇది. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను ఆవిష్కరించింది అమెజాన్. నందిని రూపొందించిన ఈ సిరీస్ లో నటుడు నవీన్ చంద్ర టైటిల్ పాత్రలో నటించగా.. సునైనా, కన్నా రవి, మాలినీ జీవరత్నం, శ్రీకృష్ణ దయాళ్ కీలక పాత్రలు పోషించారు. 10 ఎపిసోడ్‌ల సిరీస్‌ను భారతదేశంతో పాటు.. 240కి పైగా దేశాల్లో మార్చి 29న ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కు ఉంచనున్నారు.

ట్రైలర్ తమిళనాడులోని ఒక సుందరమైన గ్రామం, పచ్చదనంతో నిండిన అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరించారు . అనూహ్య మరణాలతో ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో ఈ సిరీస్ ను చిత్రీకరించారు. ఇన్‌స్పెక్టర్, రిషి, ఇద్దరు సబ్-ఇన్‌స్పెక్టర్లు అయ్యనార్, చిత్రతో కలిసి, అడవి రహస్యాలను వెలికితీయడం, ఈ క్రమంలో వాళ్లు కనుకొన్న నిజాలతో ఈ సిరీస్ తెరకెక్కించారు.

ఈ సిరీస్ లో అతీత శక్తులు కూడా ఉన్నాయని తెలిపింది అమెజాన్ ప్రైమ్ వీడియోస్. ఈ కంపెనీకి తెలుగులో ఈమధ్య కాలంలో ఆశించిన స్థాయిలో మంచి సక్సెస్ దక్కలేదు. ఇన్‌స్పెక్టర్ రిషితో ఆ లోటు తీరుతుందని భావిస్తోంది. ఒకవేళ ఇది హిట్టయితే.. స్థానిక భాషల్లో మరిన్ని వెబ్ సిరీస్ లు రావడానికి ఇది ప్రేరణగా నిలుస్తుంది.

First Published:  25 March 2024 5:41 PM GMT
Next Story