Telugu Global
Cinema & Entertainment

హీరోగా కాదు, నటుడిగా నిలబడతాను

హీరోగా కంటే మంచి నటుడిగా గుర్తింపు పొందాడు నవీన్ చంద్ర. క్యారెక్టర్ బాగుంటే విలన్ గా కూడా నటిస్తానంటున్నాడు.

హీరోగా కాదు, నటుడిగా నిలబడతాను
X

పెద్ద హీరో అవుతాడని అంతా ఊహించారు. కానీ మాస్ హీరో పాత్రల కంటే, నటుడిగా గుర్తింపు తీసుకొచ్చే పాత్రలు చేసేందుకు మాత్రమే ఇంట్రెస్ట్ చూపించాడు నవీన్ చంద్ర. తనకు హీరోగా నిలదొక్కుకోవాలనే తాపత్రయం ఏమాత్రం లేదని, మంచి పాత్రలు దొరికితే అది విలనీ అయినా చేస్తానని తన మనసులో మాట బయటపెట్టాడు నవీన్ చంద్ర. ఈ నటుడు ఇంకా ఏం చెప్పాడంటే...

- నటుడిగా పేరు తెచ్చే అవకాశాలు ఎక్కడున్నా వదలుకోను. నా మొదటి చిత్రం అందాల రాక్షసితో గుర్తింపు దక్కింది. ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవలో నటించినప్పుడు మరోసారి ఫేమ్ అయ్యాను. ఎన్టీఆర్ ఆ సినిమా ఫంక్షన్ స్టేజీ మీదే నా పాత్ర గురించి, నేను ఎంత బాగా నటించాను అనేది చెప్పారు. అది ఇండస్ట్రీలో బాగా రీచ్ అయ్యింది.

- నేను విలన్ పాత్రల్లో నటించినా మీ విలనీ బాగుంది అంటారు. గ్రే క్యారెక్టర్స్ చేసినా బాగుంటుంది అని చెబుతుంటారు. ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన నిజాయితీగా ఉంటుంది. నేను అది ఎక్కువగా తీసుకుంటాను. సోషల్ మీడియా ద్వారా కూడా అన్నా, మీ క్యారెక్టర్ బాగుంది అని కామెంట్స్ చేస్తుంటారు. విరాటపర్వంలో నా రోల్ పెంచాల్సింది అనే కామెంట్స్ వచ్చాయి.

- నటుడిని అయ్యేందుకు బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చాను. అప్పుడు నాలో నటన మీద ఎలాంటి ఇష్టం ఉందో, ఇప్పటికీ అదే ఆసక్తి , ఉత్సాహం ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా, వెబ్ సిరీస్ ఏది చేసినా నటుడిగా ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటాను.

First Published:  18 July 2022 1:18 PM GMT
Next Story