Telugu Global
Cinema & Entertainment

Malli Pelli - నరేష్ సినిమాలో కృష్ణ ఫ్యామిలీ

Naresh's Malli Pelli Trailer Review - మళ్లీ పెళ్లి సినిమా ట్రయిలర్ రిలీజైంది. నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనలు మళ్లీ కనిపించాయి.

Malli Pelli - నరేష్ సినిమాలో కృష్ణ ఫ్యామిలీ
X

తన నిజజీవితంలో జరిగిన కొన్ని ఘటనలకు ఫిక్షన్ జోడించి సీనియర్ నరేష్ నిర్మిస్తున్న సినిమా 'మళ్లీ పెళ్లి'. రియల్ లైఫ్ లో నరేష్, పవిత్ర మధ్య కొనసాగుతున్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇక మూడో భార్యతో నెలకొన్న వివాదాల గురించి కూడా తెలిసిందే. ఇవన్నీ కలిపి మళ్లీ పెళ్లి సినిమాను నిర్మిస్తూ, అందులో నటిస్తున్నాడు నరేష్.

ఈరోజు ఈ సినిమా ట్రయిలర్ రిలీజైంది. టీజర్ లో చూపించినట్టుగానే, ట్రయిలర్ లో కూడా నరేష్ నిజజీవితంలో జరిగిన ఘటనల్ని చూపించారు. అయితే వాటికి బోలెడంత ఫిక్షన్ జోడించారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. ట్రయిలర్ లో నరేష్ తండ్రి, తల్లి పాత్రల్ని కూడా చూపించారు. నరేష్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ పాత్రను శరత్ బాబు పోషించగా.. తల్లి విజయనిర్మల పాత్రను జయసుధ పోషించారు.

ఇక సినిమాలో మహేష్ బాబు ప్రస్తావన కూడా ఉంది. నరేష్ కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయి విడాకులు అయినట్టు కూడా ట్రయిలర్ చెప్పారు. ఓ సినిమా షూటింగ్ లో నరేష్-పవిత్ర కలిశారనేది అందరికీ తెలిసిన విషయమే. ఆ సన్నివేశాలన్నీ ట్రయిలర్ లో ఉన్నాయి

ఎటొచ్చి ఈ సినిమాకు ఎలాంటి ముగింపు ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎమ్మెస్ రాజు తెరకెక్కించిన ఈ సినిమాలో అనన్య నాగళ్ల కీలక పాత్ర పోషించింది. ట్రయిలర్ రిలీజ్ సందర్భంగా పవిత్రతో తమ నిజజీవిత సంబంధంపై కీలక వ్యాఖ్యలు చేశారు నరేష్. రెండు మనసులు కలిస్తే పెళ్లయినట్టేనంటూ స్పందించారు.



Next Story