Telugu Global
Cinema & Entertainment

Naresh: లిప్ కిస్ పెట్టి మరీ పెళ్లిపై ప్రకటన

Naresh: సీనియర్ నటుడు నరేష్, పవిత్ర మధ్య సంబంధం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడా బంధాన్ని పెళ్లితో అధికారికం చేయబోతోంది ఈ జంట.

Naresh: లిప్ కిస్ పెట్టి మరీ పెళ్లిపై ప్రకటన
X

సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. వాళ్లిద్దరి బంధం ఓపెన్ సీక్రెట్. ఎక్కడికి వెళ్లినా జంట పక్షుల్లా అలా కలిసే ఉంటారు. ఒకర్ని విడిచి ఒకరు ఉండలేరు. అది వాళ్ల వ్యక్తిగతం. సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్స్ చేయకూడదు. పొరపాటున చేస్తే కోర్టుకెళ్తారు, పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు.

అలా కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న నరేష్, పవిత్ర లోకేష్ ఇప్పుడు తమ బంధాన్ని అధికారికం చేయబోతున్నారు. ఇన్నాళ్లూ కలిసున్న ఈ జంట, త్వరలోనే పెళ్లితో ఒకటి కాబోతోంది. ఈ మేరకు తనదైన స్టయిల్ ఓ వీడియో రిలీజ్ చేసి మరీ ఈ విషయాన్ని ప్రకటించారు నరేష్.

అందమైన సాయంత్రం.. క్యాండిల్ లైట్.. మధ్యలో ఓ కేక్.. దాన్ని ఇద్దరూ కలిసి కట్ చేశారు.. ఒకరికి ఒకరు తినిపించుకున్నారు.. తర్వాత బాల్కనీలో వైన్ గ్లాసులు పట్టుకొని నిల్చున్నారు. ఆ తర్వాత అదే తన్మయత్వంతో ఇద్దరూ ఒకరి పెదాల్ని ఒకరు అందుకున్నారు. అంతే.. వెంటనే హ్యాపీ న్యూ ఇయర్ 2023 అని పడింది, ఆ వెంటనే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నామంటూ మరో కార్డ్ కూడా పడింది.

ఇలా పవిత్ర లోకేష్ ను లిప్ కిస్ పెట్టి మరీ తన నాలుగో పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు నరేష్.

నరేష్, పవిత్రకు విడివిడిగా ఇదివరకే పెళ్లిళ్లు అయ్యాయి. పవిత్రతో నరేష్ క్లోజ్ గా ఉండడం చూసి అతడి మూడో భార్య ఆమధ్య ఓ హోటల్ లో తెగ హంగామా కూడా చేశారు. దానిపై కొన్ని కేసులు నడిచాయి. ఆ తర్వాత సోషల్ మీడియాలో తమపై వస్తున్న పోస్టులు ఆపాలంటూ స్వయంగా పవిత్ర పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూసిన టైమ్ లో కూడా నరేష్-పవిత్ర పక్కపక్కనే ఉన్నారు. నరేష్ ను పవిత్ర ఒక్క క్షణం కూడా వదల్లేదు. ఆమధ్య ఓ సినిమాలో వీళ్లిద్దరూ తెరపై కనిపించేసరికి ప్రేక్షకులు విజల్స్, చప్పట్లతో గోలగోల చేశారు. అంతలా పాపులరైన ఈ జంట, కొత్త ఏడాదిలో పెళ్లి చేసుకోబోంది.



First Published:  31 Dec 2022 10:38 AM GMT
Next Story