Telugu Global
Cinema & Entertainment

Malli Pelli Teaser - నరేష్ నిజజీవిత ఘటనలతో...!

Malli Pelli Teaser - రియల్ లైఫ్ కపుల్ నరేష్, పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా మళ్లీ పెళ్లి. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు.

Malli Pelli Teaser - నరేష్ నిజజీవిత ఘటనలతో...!
X

సీనియర్ నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం 'మళ్ళీ పెళ్లి'. కన్నడ టైటిల్ మత్తే మధువే. ఈ చిత్రానికి ఎమ్‌ఎస్ రాజు దర్శకుడు. విజయ కృష్ణ మూవీస్ బ్యానర్‌పై నరేష్ స్వయంగా నిర్మిస్తున్నాడు.

ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లింప్స్ తో ఇప్పటికే సంచలనం సృష్టించింది ఈ సినిమా. తాజాగా మేకర్స్ టీజర్ రిలీజ్ చేశారు. వనిత విజయకుమార్ మీడియాతో మాట్లాడుతూ తాను మోసపోయానని చెప్పడంతో టీజర్ ప్రారంభమవుతుంది. తన భర్త పాత్ర పోషించిన నరేష్ ని మృగం అని పిలుస్తుంది. రెండోసారి తన ప్రేమను గుర్తించిన నరేష్ , పవిత్ర లోకేష్‌తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు.

టీజర్ లో చూపించిన సీన్స్ అన్నీ, నరేష్ నిజజీవితంలో జరిగాయి. టీజర్ చూస్తే, ఈ సినిమా కథ ఏంటి, ఎలా ఉండబోతోందనే విషయాన్ని ఈజీగానే ఊహించుకోవచ్చు. తన జీవితంలో జరిగిన, జరుగుతున్న ఘటనలకు సినిమా రూపమిచ్చి, తనదైన ముగింపు ఇవ్వాలనే ప్రయత్నంతో నరేష్ ఈ సినిమా నిర్మిస్తున్నట్టు కనిపిస్తోంది.

సురేష్ బొబ్బిలి, అరుల్‌దేవ్ కలిసి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. జయసుధ, శరత్‌బాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో వనిత విజయకుమార్, అనన్య నాగళ్ల, రోషన్, రవివర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ వేసవిలోనే విడుదలకానుంది మళ్లీ పెళ్లి సినిమా.



First Published:  22 April 2023 2:43 AM GMT
Next Story