Telugu Global
Cinema & Entertainment

Prathinidhi 2 | ఎన్నికల సీజన్ లో పొలిటికల్ సినిమా

Prathinidhi 2 - ప్రతినిధి2 తో రీఎంట్రీ ఇస్తున్నాడు నారా రోహిత్. ఇప్పుడీ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Prathinidhi 2 | ఎన్నికల సీజన్ లో పొలిటికల్ సినిమా
X

హీరో నారా రోహిత్ 'ప్రతినిధి 2' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ చిత్రం, వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్‌ కు మంచి స్పందన వచ్చింది. నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో మనల్ని ఆశ్చర్యపరిచాడు.

టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందం వ్యక్తం చేసిన మేకర్స్, ఉగాది శుభ సందర్భంగా సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ప్రతినిధి 2 ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతినిధి 10 సంవత్సరాల క్రితం 2014లో ఇదే తేదీన విడుదల కావడం విశేషం.

విడుదల తేదీ పోస్టర్‌లో రోహిత్ సిల్హౌట్ ఇమేజ్ చూడవచ్చు, ఇక్కడ ప్రజల ఒక వైపు చేతులు ఎత్తడం, మరొక వైపు అల్లర్లు పరిస్థితిని కూడా చూడవచ్చు. బ్యాక్ గ్రౌండ్ లో దినపత్రికలు, కథనాల విభిన్న ముఖ్యాంశాలు ఉన్నాయి. రిలీజ్ డేట్ మరెంతో దూరంలో లేకపోవడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

'ప్రతినిధి 2' అనేది ప్రతినిధి సిరీస్ నుండి రెండవ ఫ్రాంచైజీ. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ పాత్రలో కనిపించనున్నారు. సిరీ లెల్లా హీరోయిన్ గానటిస్తుండగా, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు.

First Published:  9 April 2024 5:15 PM GMT
Next Story