Telugu Global
Cinema & Entertainment

Nara Rohit | సుందరకాండతో రెడీ అయిన నారా వారి హీరో

Nara Rohit - నారా రోహిత్ తాజా చిత్రం సుందరకాండ. ఈ సినిమా టీజర్ ను లాంచ్ చేశారు.

Nara Rohit | సుందరకాండతో రెడీ అయిన నారా వారి హీరో
X

హీరో నారా రోహిత్ 20వ మూవీ ‘సుందరకాండ’. వెంకటేష్ నిమ్మలపూడిని దర్శకుడిగా పరిచయం చేస్తూ రోహిత్ చేస్తున్న సినిమా ఇది. సందీప్ పిక్చర్ ప్యాలెస్ బ్యానర్ పై సంతోష్ చిన్నపొల్ల, గౌతమ్ రెడ్డి, రాకేష్ మహంకాళి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా టీజర్‌ లాంచ్ చేశారు. ఈ టీజర్ తో సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి.

టీజర్ రిలీజ్ సందర్భంగా నారా రోహిత్ మాట్లాడుతూ.. "ఇదొక పెక్యులర్ లవ్ స్టొరీ. కమ్ బ్యాక్ మూవీ గా ఈ స్క్రిప్ట్ నే లాక్ చేశాం. ఈ సినిమా జర్నీ చాలా స్పెషల్. సంతోష్, గౌతమ్, రాకేశ్ సినిమాని బలంగా నమ్మారు. వెంకీ బ్రిలియంట్ కథ రాశారు. ఈ స్టేజ్ మీద ఉన్న అందరినీ కథే తీసుకొచ్చింది. టీజర్ మీ అందరికీ నచ్చిందే అనుకుంటున్నాను. లియాన్ జేమ్స్ మంచి ఆల్బం ఇచ్చాడు. మంచి పాటలు కుదిరాయి. మున్ముందు సినిమా నుంచి మరింత కంటెంట్ రాబోతోంది." అన్నాడు.

ఈ సినిమాతో వృత్తి వాఘని హీరోయిన్ గా నటించగా, సెకెండ్ హీరోయిన్ గా శ్రీదేవి శరత్ కుమార్ నటించింది. కీలక పాత్రలో వాసుకి, అభినవ్ గోమఠం కీలక పాత్రలు పోషించారు. ఇదొక ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటున్నాడు రోహిత్.

First Published:  27 Aug 2024 6:27 AM GMT
Next Story