Telugu Global
Cinema & Entertainment

Saripodha Sanivaaram | రేపట్నుంచి మరో హంగామా

Saripodha Sanivaaram - నాని హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ సరిపోదా శనివారం. ఈ మూవీ షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం

Saripodha Sanivaaram | రేపట్నుంచి మరో హంగామా
X

నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ మరోసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా ఫిల్మ్ కు 'సరిపోదా శనివారం' అనే టైటిల్ పెట్టారు. 'అంటే సుందరానికీ' చిత్రంలో నాని సాఫ్ట్ పాత్రలో కనిపించగా, ఈ చిత్రంలో మునుపెన్నడూ లేని యాక్షన్-ప్యాక్డ్ క్యారెక్టర్‌లో కనిపించి ఆశ్చర్యపరచబోతున్నాడు నాని. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం నెక్స్ట్ షూటింగ్ షెడ్యూల్ రేపట్నుంచి ప్రారంభించబోతున్నారు. హీరో నానితో పాటు ఇతర తారాగణం పాల్గొనే ఈ షెడ్యూల్ లో పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ పాటు కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ యాక్షన్ సీన్స్ సినిమాలో హైలెట్ గా ఉంటాయి.

ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్ జే సూర్య విలన్ గా కనిపించనున్నాడు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి మురళి డీవోపీగా పని చేస్తున్నారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటర్.

ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ఆగస్ట్ 29న విడుదల చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

First Published:  17 March 2024 8:39 AM GMT
Next Story