Telugu Global
Cinema & Entertainment

#Nani30: నాని సినిమాకు అంతా రెడీ.. డేట్ కూడా ఫిక్స్

Nani's new movie shooting - దసరా సినిమా పూర్తిచేసిన నాని అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. వచ్చేనెల 1 నుంచి మరో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు.

#Nani30: నాని సినిమాకు అంతా రెడీ.. డేట్ కూడా ఫిక్స్
X

నాని 30వ చిత్రాన్ని న్యూ ఇయర్ సందర్భంగా అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ నిర్మిస్తునారు. తండ్రీకూతుళ్ల మధ్య అందమైన బంధాన్ని చూపించే హార్ట్ టచింగ్ వీడియో ద్వారా సినిమాలో నాని వరల్డ్ ని కూడా మేకర్స్ రివిల్ చేశారు. గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రం ప్రారంభ పూజా కార్యక్రమం జనవరి 31న హైదరాబాద్‌లో జరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో నానికి జోడిగా నటించనుంది. ఈ చిత్రంలో కొంతమంది ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హృదయం మూవీ ఫేమ్‌ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు.

గ్యాప్ లేకుండా సినిమాలు చేయడం నాని స్టయిల్. దసరా సినిమాను ఇలా పూర్తిచేసి, అలా తన కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్తున్నాడు ఈ హీరో. ఈ ఏడాది కనీసం 3 సినిమాలు రిలీజ్ చేయాలనేది నాని టార్గెట్.

First Published:  28 Jan 2023 2:46 PM GMT
Next Story