Telugu Global
Cinema & Entertainment

Meet Cute: నాని సినిమాకు స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

Nani's Meet Cute: నిర్మాతగా నాని తీసిన తొలి ఆంథాలజీ మూవీ మీట్-క్యూట్. ఈ సినిమా స్ట్రీమింగ్ కు డేట్ లాక్ అయింది.

Meet Cute: నాని సినిమాకు స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది
X

టీజర్‌తో అందరినీ మెస్మరైజ్ చేసిన ''మీట్ క్యూట్' టీమ్ తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది. టీజర్ అన్ని ప్రధాన పాత్రలను పరిచయం చేసి రోలర్ కోస్టర్ ఎమోషన్ ని చూపించగా, ట్రైలర్ మరింతగా ఆకట్టుకుంది.

'నీకు మీట్‌ క్యూట్‌ అంటే తెలుసా.. అనుకోకుండా ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు మొదటిసారి కలిసినప్పుడు వాళ్ల మధ్య వచ్చే అందమైన పరిస్థితులు.. మాటలు.. ఆ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుండిపోతాయి'' అంటూ నాని వాయిస్‌ ఓవర్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ మనసును హత్తుకునేలా ఉంది.

కొన్ని అర్బన్ ప్రేమ కథలను.. విభిన్న ప్రేమికుల మధ్య విభిన్న భావోద్వేగాలను ఈ ట్రైలర్ లో ఆవిష్కరించారు. మనం ప్రేమించే వారితో, మనం ఇష్టపడే వాటి కోసం మాత్రమే గొడవపడతాం' అనే సందేశాన్ని ఈ ఎంథాలజీ లో చర్చించారు.

ఇందులో ప్రతి కథకు ప్రాముఖ్యత ఉంది. ఈతరం యువతకు కనెక్ట్ అవుతుందంటున్నారు దర్శకురాలు దీప్తి గంటా. వాల్ పోస్టర్ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని 'మీట్ క్యూట్' నిర్మిస్తున్నారు. సత్యరాజ్, రోహిణి మొల్లేటి , అదా శర్మ , వర్షా బొల్లమ్మ, ఆకాంక్ష సింగ్, రుహాని శర్మ ,సునయన, సంచిత, అశ్విన్ కుమార్, శివ కందుకూరి, దీక్షిత్ శెట్టి, గోవింద్ పద్మసూర్య, రాజా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవంబర్ 25 నుండి సోనీ లివ్‌లో ఈ ఎంథాలజీ స్ట్రీమింగ్ కు రానుంది.

First Published:  19 Nov 2022 12:36 PM GMT
Next Story