Telugu Global
Cinema & Entertainment

Hi Nanna | నాని మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?

Hi Nanna - నాని తాజా చిత్రం హాయ్ నాన్న. డిఫరెంట్ సబ్జెక్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు.

Hi Nanna | నాని మూవీ ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

హీరో నాని మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ 'హాయ్ నాన్న'. వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ ని తాజాగా లాంఛ్ చేశారు.

నాని ఒక రాజు కథను చెప్పడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అందులో తల్లి పాత్ర లేనప్పుడు, పాప తన తల్లి కథను చెప్పమని కోరుతుంది. అతను ప్రతిదీ వివరిస్తాడు కానీ ఆమె తల్లి గురించి ఏదో దాచిపెడతాడు. కథలో చాలా ఎమోషన్ ఉంది, దీంతో పాప తన తల్లి గురించి తండ్రిని ఇబ్బందిపెట్టాలని అనుకోదు. కథలో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, పాప కొత్త స్నేహితురాలు యష్నా (మృణాల్)ని తన తల్లిగా ఊహించుకుంటుంది. అయితే, శృతి హాసన్, విరాజ్ భార్యగా, మహి తల్లిగా రివీల్ అవుతుంది.

ట్రైల‌ర్ ముందుకు వెళుతున్న కొద్దీ క‌థ‌లో చాలా లేయ‌ర్లు ఆసక్తిగా తెరపైకి వస్తాయి. ప్రేమకథలో మ్యాజిక్ ఉంది, తండ్రీకూతుళ్ల ఎమోషన్ ప్రతిఒక్కరినీ హత్తుకుంటుంది. దర్శకుడు శౌర్యువ్ పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ని అద్భుతంగా మలిచాడు. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లకు భిన్నంగా కథను చాలా కొత్త తరహాలో ప్రజెంట్ చేసినట్టు ట్రయిలర్ చూస్తే అర్థమౌతోంది.

రొమాంటిక్ సన్నివేశాలు, ఎమోషనల్ ఎపిసోడ్స్ , ప్రతి ఫ్రేం లో రిచ్ నెస్, లైటింగ్‌, బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ట్రయిలర్ లో అడుగడుగునా కనిపించాయి. గోవా, కూనూర్ మొదలైన అద్భుతమైన లొకేషన్‌ లను చాలా అందంగా చూపించారు.హేషామ్ అబ్దుల్ వహాబ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మనసుకు హత్తుకునేలా ఉంది. డిసెంబర్ 7న థియేటర్లలోకి వస్తోంది హాయ్ నాన్న సినిమా.

First Published:  24 Nov 2023 5:31 PM GMT
Next Story