Telugu Global
Cinema & Entertainment

Dasara Trailer - నాని మాస్ అవతార్

Nani's Dasara Movie - దసరా మూవీ ట్రయిలర్ రిలీజైంది. ఆ ట్రయిలర్ ఎలా ఉందో చూద్దాం..

Dasara Trailer - నాని మాస్ అవతార్
X

దసరా ప్రమోషన్ పీక్ స్టేజ్ కు చేరింది. ఈ సినిమా నుంచి తాజాగా ట్రయిలర్ రిలీజైంది. తన కెరీర్ లోనే నాని ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ పోషించిన సినిమా ఇదే. అందుకేనేమో ఆ మాస్ ఎలిమెంట్స్ అన్నింటినీ ఈ ట్రయిలర్ లో చూపించారు.

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో, పీరియాడిక్ మూవీగా దసరా సినిమా వస్తోందనే విషయం అందరికీ తెలిసిందే. ట్రయిలర్ ను కూడా అదే బ్యాక్ డ్రాప్ తో మొదలుపెట్టారు. పెళ్లికూతురు గెటప్ లో కీర్తిసురేష్ ను పరిచయం చేశారు.

ఆ వెంటనే నాని పోషించిన ధరణి పాత్రను, ఆ పాత్ర తీరుతెన్నుల్ని ట్రయిలర్ లో చూపించారు. తన స్నేహితుల కోసం ఎంత దూరమైనా వెళ్లే పాత్రలో నానిని ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల.

మందు కొడుతూ, స్నేహితులతో సరదాగా గడుపుతూ, ఊరిలో అల్లరిచిల్లరిగా తిరిగే ధరణి, ఓ సందర్భంలో కత్తి పట్టాల్సి వస్తుంది. అది ఎందుకనే విషయంపై సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ దసరా ట్రయిలర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు.

దీంతో పాటు నాని-కీర్తిసురేష్ మధ్య చిన్నప్పట్నుంచే లవ్ ఉందనే విషయాన్ని, వాళ్ల ప్రేమకు ఓ పెద్ద సమస్య ఎదురైందనే విషయాన్ని కూడా ట్రయిలర్ లో చూపించారు. ఓవరాల్ గా దసరా సినిమాను ఓ మాస్ యాక్షన్ ప్రేమకథగా చెప్పుకోవచ్చు.

ట్రయిలర్ లో నాని గెటప్, అతడి డైలాగ్ డెలివరీ బాగున్నాయి. నాని ఫ్రెండ్ గా కీలక పాత్ర పోషించిన దీక్షిత్ శెట్టికి కూడా ట్రయిలర్ లో చోటు దక్కింది. సంతోష్ నారాయణన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ ట్రయిలర్ లో హైలెట్స్ గా నిలిచాయి.

నాని కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈనెల 30న థియేటర్లలోకి వస్తోంది దసరా. ఈ మూవీపై చాలా ఆశలు పెట్టుకున్నాడు నాని.



First Published:  14 March 2023 3:45 PM GMT
Next Story